Pawan Kalyan: చాలా చిన్న జీవితాన్ని గడపాలనుకున్నా… బ్రో ప్రిరిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

పవన్‌, సాయి ధరమ్‌ తేజ్‌ నటిస్తున్న బ్రో సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పవన్‌ సుధీర్ఘంగా స్పీచ్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్‌ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సినిమాలో భాగస్వామ్యమైన ప్రతీ ఒక్కరికీ పవన్ కృతజ్ఞతలు తెలిపారు..

Pawan Kalyan: చాలా చిన్న జీవితాన్ని గడపాలనుకున్నా... బ్రో ప్రిరిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Pawan Kalyan

Updated on: Jul 25, 2023 | 11:25 PM

పవన్‌ కళ్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ హీరోలుగా తెరకెక్కిన బ్రో సినిమా ఈ నెల 28న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌, పాటలు ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా థమన్‌ మ్యూజిక్‌ సిసిమాకు హైలెట్‌గా నిలిచింది. సినిమా విడుదల దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ మంగళవారం హైదరాబాద్‌లోని శిల్ప కళావేదిలో ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు పవన్‌తో పాటు సాయి ధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌లు హాజరయ్యారు.

ఈవెంట్‌కు హాజరైన పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల సమక్షంలో ఉత్సాహంగా మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ… ‘ఇంత అభిమానం, ప్రేమ ఒక్కోసారి కలా, నిజమా అనిపిస్తుంది. ఇది నేను కోరుకున్న జీవితం కాదు, దేవుడు నాకు ఇచ్చిన జీవితం. చాలా చిన్న జీవితాన్ని గడపాలనుకున్నా, రాజకీయాల్లో కూడా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. అభిమానులపై నాకున్న ప్రేమను మాటల్లో చెప్పలేను. సినిమా సమాజానికి ఉపయోగపడాలని నేను కోరుకుంటాను. బ్రో సినిమా ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చింది. కరోనా పరిస్థితుల్లో ఉన్నప్పుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ గారు నాకు ఫోన్‌ చేశారు. సముద్రఖని గారు చెప్పిన కథను విన్నాను బాగుంటుంది అన్నారు. అభిమానులను దృష్టిలో పెట్టుకొని నేను అభిమానులకు ఎలా నచ్చుతానే అలా నా పాత్రను డిజైన్‌ చేశారు. మన భాష కాకపోయినా సముద్రఖని తెలుగులో స్క్రిప్ట్‌ రాసుకొని చదివారు. నాతో సినిమా చేయడానికే తెలుగు చదవడం నేర్చుకున్నారు’ అని చెప్పుకొచ్చారు.

పవన్‌ ఇంకా మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీకి ఒక్కరికి సంబంధించింది కాదు. ప్రతీ ఒక్కరూ ఇండస్ట్రీకి రావొచ్చు. నా పాటికి నేను చిన్న జీవితం గడిపే వాడిని కానీ మా వదిన కారణంగానే నేను సినిమాల్లోకి వచ్చాను. త్రికరణ శుద్ధితో పనిచేయడం ఒక్కటే నాకు తెలుసు.? నేను ఈ రోజు ఈ స్థానంలో ఉండడానికి కారణం ఇదే. అందరు హీరోలంటే నాకు ఇష్టం. ఎందుకుంటే వాళ్లు కష్టపడి పని చేస్తారు తప్ప ఎవ్వరినీ దోచుకోరు. ఒక్క హీరో సినిమా చేస్తే ఎంతో మంది జీవితాలు గడుస్తున్నాయన్నారు. అలాగే బ్రో సినిమాలో భాగస్వామ్యమైన ప్రతీ ఒక్కరికీ పవన్‌ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సాయి ధరమ్‌ తేజ్‌ ప్రమాదంపై స్పందించిన పవన్‌.. సాయి ధరమ్‌ తేజ్‌ ఈ రోజు ఇక్కడ ఉన్నాడంటే దానికి ఆ రోజు ప్రమాద సమయంలో కాపాడిన అబ్దుల్‌ కారణమని, అతనికి కృతజ్ఞతలు అంటూ పవన్‌ ఎమోషనల్ అయ్యారు. తేజ్‌ను బయటకు తీసుకొచ్చిన అపోలో, మెడికవర్‌ ఆసుపత్రి వర్గాలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

ఇక హీరో సాయి ధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ.. ‘పవన్‌ మామయ్య ఫోన్‌ చేసి ఒక సినిమా ఉందని అడిగారు. నేను మెయిన్‌ రోల్‌ మామయ్య గెస్ట్ రోల్‌ అని చెప్పలేదు. కానీ చివరికీ నన్ను ఒప్పించారు. నిజానికి సినిమా ముందే చేయాల్సింది కానీ ఒక చిన్న సంఘటన వల్ల వాయిదా పడింది. నేను 12 రోజులు కోమాలో ఉన్నాను, ఆ సమయంలో మామయ్య (పవన్‌) ప్రతీ రోజూ షూటింగ్ వెళ్లే సమయంలో వచ్చి నన్ను మాట్లాడారు. మీరు ఊహించిన దానికంటే బ్రో సినిమా బాగుంటుంది. ఫ్యాన్స్‌ కాలేర్‌ ఎగరేసుకునేలా సినిమా ఉండనుంద’ని చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..