అయ్ బాబోయ్ లక్షే.. కరెంట్‌ బిల్లు చూసి షాక్‌కు గురైన నటి

| Edited By:

Jun 26, 2020 | 6:17 PM

కరోనా నేపథ్యంలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న ప్రజలకు కరెంట్ బిల్లులు షాక్‌ ఇస్తున్నాయి. చిన్న చిన్న గుడిసెలకు సైతం ఊహించని రీతిలో కరెంట్ బిల్లులు వస్తున్నాయి.

అయ్ బాబోయ్ లక్షే.. కరెంట్‌ బిల్లు చూసి షాక్‌కు గురైన నటి
Follow us on

కరోనా నేపథ్యంలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న ప్రజలకు కరెంట్ బిల్లులు షాక్‌ ఇస్తున్నాయి. చిన్న చిన్న గుడిసెలకు సైతం ఊహించని రీతిలో కరెంట్ బిల్లులు వస్తున్నాయి. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సామాన్యులకే కాదు ఇప్పుడు సెలబ్రిటీలకు కూడా ఈ షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా నటి కార్తీక ఇంటికి అక్షరాలా లక్ష రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించిన కార్తీక తన కోపం మొత్తాన్ని కక్కేసింది. ముంబైలో ఏ కుంభ‌కోణం జ‌రుగుతోంది అంటూ అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్‌, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆమె ప్రశ్నించారు.

జూన్‌లో నాకు దాదాపుగా లక్ష రూపాయల బిల్లు వచ్చింది. లాక్‌డౌన్‌లో కరెంట్ మీటర్ రీడింగ్‌ తీయకుండా వాళ్లకు ఇష్టమొచ్చినట్లు వేశారు. ముంబయివాసుల నుంచి ఇలాంటి కంప్లైట్‌లు చాలా వింటున్నా అని కార్తీక ట్వీట్ వేశారు. కాగా సీనియర్ నటి రాధా కుమార్తె అయిన కార్తీక.. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. ఆ తరువాత బుల్లితెరపైకి షిఫ్ట్ అయ్యింది. ‘ఆరంభ్‌: కహానీ దేవసేన కీ’ అనే సీరియల్‌లో కార్తీక నటించింది.