Dance Master Cool Jayanth: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. క్యాన్సర్‏తో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ మృతి..

ఇటీవల కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణంతో చిత్రపరిశ్రమలో శోకసంద్రంలో మునిగిపోయింది. పునీత్ మరణించి రెండు

Dance Master Cool Jayanth: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. క్యాన్సర్‏తో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ మృతి..
Cool Jayanth

Updated on: Nov 11, 2021 | 11:52 AM

ఇటీవల కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణంతో చిత్రపరిశ్రమలో శోకసంద్రంలో మునిగిపోయింది. పునీత్ మరణించి రెండు వారాలు గడుస్తూన్న ఇంకా ఆయన అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ వేలాదిమంది ప్రజలు పునీత్ సమాధి వద్దకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ డ్యాన్సర్ కూల్ జయంత్ (44) మరణించారు. బుధవారం ఉదయం చెన్నైలోని ఆయన స్వగృహంలో కన్నుముశారు. కూల్ జయంత్ మరణంపై తమిళ సినీ పరిశ్రమ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది.

కూల్ జయంత్ సినీరంగంలో డ్యాన్సర్‏గా జీవితాన్ని ప్రారంభించి డ్యాన్స్ మాస్టర్‏గా.. దర్శకుడిగా ఎదిగారు. ప్రభుదేవా, రాజు సుందరం వద్ద పలు చిత్రాలకు డ్యాన్సర్ గా పనిచేసిన కూల్ జయంత్ సుమారు 800 చిత్రాలకు పైగా డ్యాన్సర్ గా పని చేశారు. అనంతరం కాదల్ దేశం చిత్రం ద్వారా నృత్య దర్శకుడిగా పరిచయమ్యారు. తమిళం, మలయాళం భాషల్లో సుమారు 100కు పైగా చిత్రాలకు నృత్య దర్శకుడిగా పనిచేశారు. మలయాళంలో మమ్ముట్టి.. మోహన్ లాల్ వంటి స్టార్ హీరోల చిత్రాలకు డ్యాన్స్ మాస్టర్ గా పనిచేశారు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం స్థానిక వెస్ట్ మాంబళంలోని స్వగృహంలో కన్నుమూశారు. ఇక నిన్న సాయంత్రం కూల్ జయంత్ అంత్యక్రియలు జరిగాయి.

Also Read: Raviteja Khiladi: ఖిలాడి నుంచి అదిరిపోయే సర్‏ప్రైజ్.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మాస్ మహారాజా..

Thaman: పుష్ప పాటలపై షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్.. ఏం చెప్పారంటే..

Attack on Vijay Sethupathi: విజయ్ సేతుపతి పై దాడి తమిళనాట రచ్చ.. మహాగాంధీ మాటల్లో నిజమెంత.. (వీడియో)