Pooja Hegde Coments: వరంగల్ ప్యాన్స్ గురించి బుట్టబొమ్మ ఏం చెప్పిందో తెలుసా.. తన లైఫ్‌లో ది బెస్ట్ అంటూ..
Pooja Hegde Coments: అలా వైకుంఠపురం సినిమాతో హీరోయిన్ పూజాహెగ్డే స్టార్‌డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. బుట్టబొమ్మ.. బుట్టబొమ్మ అంటూ అందరి నోళ్లలో సంవత్సరం
Pooja Hegde Coments: అలా వైకుంఠపురం సినిమాతో హీరోయిన్ పూజాహెగ్డే స్టార్‌డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. బుట్టబొమ్మ.. బుట్టబొమ్మ అంటూ అందరి నోళ్లలో సంవత్సరం పొడవునా నానుతోంది. దీంతో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించింది. తన నటనతో కుర్రకారు గెండెల్లో గుడి కట్టుకుంది. దీంతో టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా బుట్టబొమ్మ సంగతులే వినిపిస్తున్నాయి. ఇటీవల బుట్టబొమ్మ సాంగ్ కూడా యూట్యూబ్‌లో 500 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును సాధించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఈ హ్యాపీనెస్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన పూజ మరో ఎమోషనల్ స్టోరీని కూడా అభిమానులతో పంచుకుంది. వరంగల్ ఫ్యాన్స్ తన పేరుమీద లాక్‌డౌన్‌లో చేసిన సామాజిక కార్యక్రమాలను చూస్తుంటే గర్వంగా ఉందని ప్రకటించింది. కరోనా టైమ్‌లో ఆహారం, పండ్లు, బెడ్ షీట్స్, శానిటైజర్స్ పంపిణీ చేసిన ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు చెప్పింది. తన లైఫ్‌లో ది బెస్ట్ అంటూ ఇందుకు సంబంధించిన ఫ్లెక్సీని కూడా షేర్ చేసింది పూజ. అతిథి మానసిక దివ్యాంగుల ట్రస్ట్‌లో ఈ పంపిణీ కార్యక్రమం జరగ్గా పూజ తన స్టోరీస్‌లో తమ గురించి షేర్ చేయడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. దీంతో బుట్టబొమ్మను మరింతగా ఆరాధిస్తున్నారు.
మంచి సినిమాలు ఏ భాషలో చేసిన ఆదరిస్తారంటున్న బుట్టబొమ్మ.. కానీ తెలుగు హీరోయిన్ అనిపించుకోవడం కంటే..
వరుస సినిమాలతో దూసుకెళుతోన్న ‘బుట్టబొమ్మ’.. మూడు భాషల్లో ఐదు సినిమాలతో బిజీగా మారిన పూజా.