Love Story: పోలాండ్ దేశానికి చెందిన జిబిగ్జ్( బుజ్జి) అనే కుర్రాడు తెలుగు పాటలు పాడతూ, డైలాగ్స్‌లను చెబుతూ.. పాపులర్‌గా మారాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్‌లు, పాటలు పాడిన ఈ 12 ఏళ్ల కుర్రాడు సోషల్ మీడియాలో ఓ చిన్న సైజ్ సెలబ్రెటీగా మారాడు. ‘కొడకా కోటేశ్వర్రావు’ పాటతో జిబిగ్జ్ తెలుగు ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాడు. కేవలం ప్రేక్షకులను కాకుండా ఏకంగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ను తనవైపు తిప్పుకున్నాడీ కుర్రాడు. ఆ తర్వాత నుంచి తెలుగు సినిమా పాటలను పాడుతూ నిత్యం సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా ఇదే క్రమంలో జిబిగ్జ్ మరో తెలుగు పాటను ఆలపించి అందరినీ మెస్మరైజ్ చేశాడు. అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ‘లవ్ స్టోరీ’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ‘నీ చిత్రం చూసి.. నా చిత్తం చెదిరి, నే చిత్తరువైతిరయ్యో..’ అనే పాట యువతను పెద్ద ఎత్తున ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పాటలోని చరణాలు యువతీయువకుల మధ్య ప్రేమను చాటిచెప్పేలా ఉన్నాయి. ఇక తాజా పోలాండ్ కుర్రాడు జిబిగ్జ్ ఈ పాటను కూడా అద్భుతంగా ఆలపించాడు. ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన కుర్రాడు.. ‘హాయ్ నాగచైతన్య, హాయ్ సాయి పల్లవి.. లవ్ స్టోరీ సినిమాలోని ‘నీ చిత్రం చూసి’ పాటను పాడాను. ఎలా ఉందో చెప్పండి’ అంటూ క్యాప్షన్‌తో జోడించాడు. అచ్చ తెలుగు పదాలను కూడా ఎలాంటి తడబాటు లేకుండా కుర్రాడు పలకిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరి ఈ పొలాండ్ కుర్రాడు పాడిన పాటను మీరూ వినేయండి.
Hello @chay_akkineni
Hi @Sai_Pallavi92
Am Zbigs 12 years,from Poland?I sang #NeeChitramChoosi from #LoveStory 4U
Pls let Me kno UR Impressions?@sekharkammula (Great Music sense)@anuragkulkarni_ (Great Voice)@pawanch19 (Great Music)@adityamusic https://t.co/nXB93i3vd6 pic.twitter.com/cOFPYsBXpp— zbigniew ( Bujji) (@ZbigsBujji) September 18, 2021
ఇంతకీ ఈ కుర్రాడికి తెలుగుపై ఇంత పట్టు ఎలా వచ్చిందనేగా మీ సందేహం. నిజానికి జిబిగ్జ్ తండ్రి మన హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి. అతని పేరు శరత్. ఈయన దాదాపు పాతికేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి పోలాండ్ వెళ్లాడు. అనంతరం అక్కడే స్థిరపడ్డ శరత్, పోలాండ్‌కు చెందిన యూలా అనే మహిళలను వివాహమాడాడు. వీరికి కలిగిన సంతానమే ఈ చిచ్చరపిడుగు. దీంతో తెలుగుపై తనకున్న ఇష్టాన్ని శరత్ ఇలా తన కుమారుడితో తీర్చుకున్నాడన్నమాట. తండ్రి ప్రోత్సాహంతో ఈ కుర్రాడు కర్ణాటక సంగీతంతో పాటు తెలుగు భాషను నేర్చుకున్నాడు.
Also Read: Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా విడుదలకు రంగం సిద్ధం.. రిపబ్లిక్ వచ్చేది ఎప్పుడంటే..
Ganesh Immersion: బొజ్జ గణపయ్య నిమజ్జనోత్సవానికి సర్వం సన్నద్ధం.. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు