పాయల్ డేరింగ్ డెసీషన్స్

పాయల్ డేరింగ్ డెసీషన్స్

‘ఆర్ఎక్స్ 100’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన పాయల్ రాజ్‌పుత్…కుర్రకారుకు ఏసీ థియేటర్లలో కూడా చెమటలు పట్టించింది. హాట్ హాట్ అందాలతోనే కాదు నెగటీవ్ షేడ్స్ పాత్రతో మెప్పించి స్టార్ డమ్ అందుకుంది.  క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో పాయల్ ఇంటి ముందు నిర్మాతలు క్యూ కట్టారు. ఆమెకు ఈ సినిమా తెచ్చిన క్రేజ్‌తో మరో హీరోయిన్ అయితే వరుస పెట్టి సినిమాలు చేసేది.   అయితే పాయల్ మాత్రం అందుకు భిన్నంగా అడుగులు వేస్తోంది. ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలైతేనే […]

Ram Naramaneni

|

Feb 21, 2019 | 3:23 PM

‘ఆర్ఎక్స్ 100’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన పాయల్ రాజ్‌పుత్…కుర్రకారుకు ఏసీ థియేటర్లలో కూడా చెమటలు పట్టించింది. హాట్ హాట్ అందాలతోనే కాదు నెగటీవ్ షేడ్స్ పాత్రతో మెప్పించి స్టార్ డమ్ అందుకుంది.  క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

దీంతో పాయల్ ఇంటి ముందు నిర్మాతలు క్యూ కట్టారు. ఆమెకు ఈ సినిమా తెచ్చిన క్రేజ్‌తో మరో హీరోయిన్ అయితే వరుస పెట్టి సినిమాలు చేసేది.   అయితే పాయల్ మాత్రం అందుకు భిన్నంగా అడుగులు వేస్తోంది. ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలైతేనే సైన్ చేస్తోంది. ప్రస్తుతం రెండు విమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌కి ఓకే చెప్పిన పాయల్.. మరోవైపు తోటి కథానాయికలు తీసుకోలేని డేరింగ్ డెసిషన్ తీసుకుంటూ ఆశ్చర్యపరుస్తోంది. అదేమిటంటే.. వరుసగా సీనియర్ హీరోలతో నటించేందుకు ఈ ముద్దుగుమ్మ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. ఇటీవలే  ‘యన్.టి.ఆర్. కథానాయకుడు’లో బాలయ్యతో కలసి ఓ సీన్‌లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ… ప్రస్తుతం ‘డిస్కో రాజా’లో రవితేజ లాంటి 50 ప్లస్ హీరోతో ఆడిపాడుతోంది. అంతేకాదు ‘మన్మథుడు 2’లో నాగార్జునతోనూ, ‘వెంకీ మామ’లో వెంకటేశ్ తోనూ ఈ అమ్మడి పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. మొత్తానికి సెన్సేషనల్ క్యారెక్టర్‌తో ఎంట్రీ ఇవ్వడమే కాదు.. సెన్సేషనల్ డెసిషన్ తోనూ పాయల్ ‘‘టాక్ ఆఫ్ ఇండస్ట్రీ’’ అవుతోంది. మరి సీనియర్ హీరోల పక్కన పాయల్ ఏ రేంజ్‌లో మెప్పిస్తుందో చూడాలి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu