Vakeel Saab movie pre release event: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరాగా దూసుకుపోతున్నారు. మొదట్లో చిరంజీవి సోదరుడిగానే అందరికీ కనిపించిన పవన్ ఆ తరువాత.. తనకంటూ సూపర్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. పవన్ యాక్టింగ్‌లోనే కాదు.. డ్యాన్స్‌ల్లోను.. ఫైట్లలోనూ.. తనకే సాధ్యం అయిన స్టైల్‌తో.. యాటిట్యూడ్‌తో మెగా ఫ్యాన్సందరినీ మెస్మరైజ్ చేసి.. తరిగిపోని తిరుగులేని క్రేజ్‌ని తరిగిపోని అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. “అజ్ఙానతవాసి” సినిమా తరువాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి, రాజకీయా పార్టీ పెట్టిన పవన్.. ఆ తరువాత అభిమానుల కోరిక మేరకు తిరిగొచ్చి వరుస సినిమాలు చేస్తున్నాడు. దాదాపు 3 ఏళ్ల గ్యాప్ తరువాత ఓ మాంచి సినిమాతో వెండి తెరపై మెరవబోతున్నాడు. అలా ఒక సినిమాతో మెరవడమే కాదు.. వరుసగా యంగ్ అండ్ క్రేజీ డైరెక్టర్లకు ఓకే చెబుతూ.. వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.పింక్ రిమేక్‌గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమాను వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తుండా.. దిల్ రాజు నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో… కోర్టులో దోషులుగా మగ్గురు మగువలు నివేతా థామస్, అంజలి, అనన్య నాగల్లి నటించారు. ప్రకాశ్ రాజ్ డిఫెన్స్ లాయర్ నందాగా నటించాడు. ఇక వీరితో పాటు సీనియర్ యాక్టర్ నరేష్, ముఖేష్ ఋషి, సుబ్బరాజు, దేవ్ గిల్, అనసూయలు నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరుగుతుంది.
మా అన్నయ చెప్పిన ఒక్క మాట నన్ను నటుడిని చేసింది. నేను చదువును వదిలేసిన వ్యక్తిని కానీ నేను పుస్తకాలు చదువుతాను.. నాకు తెలిసిన వకీల్ సాబ్ ‘నాని పల్కి వాలా’. మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్న సమయంలో పోరాడిన వ్యక్తి. ఆయన గురించి చదివిన తర్వాత లాయర్ వృత్తిపై గౌరవం పెరిగింది. మానవ హక్కుల కోసం పోరాడే వ్యక్తులపైనా నాకు అపారమైన గౌరవం ఉంది. ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నా.. అమితాబ్ కు నేను పెద్ద అభిమానిని ఆయన పాత్ర నేను చేస్తా అనుకోలేదు.. నా ప్రతి సినిమాలో సామాజిక స్పృహ ఉండేలా చూసే వ్యక్తిని నేను. నా సినిమలో అలాంటివి చాలా ఉన్నాయి. సినిమాలో ఐటమ్ సాంగ్స్ బదులు దేశభక్తి సాంగ్స్ చేయడానికి ఇష్టపడేవాడినినేన.. అలా అని నేను ఐటమ్ సాంగ్స్ ను తప్పు అనను. స్త్రీలను గౌరవించే నాకు ఈ వకీల్ సాబ్ సినిమాను ఆడపడుచులందరికి గౌరవంలో భాగంగా ఈ సినిమాను అందిస్తున్నాం. మేము షూటింగ్స్ చేసే సమయంలో మా చుట్టూవున్న ఆడవాళ్లను ఏడిపించేవారు..ఆ సమయంలో నేను కర్ర పట్టుకొని బయటకు వెళ్ళేవాడిని అన్నారు పవన్. లాయర్ గా ప్రకాష్ రాజ్ గారు సినిమాకు వన్నె తెచ్చారు. నా పర్ఫామెన్స్ బాగుంది అంటే అది ప్రకాష్ రాజ్ గారు వల్లే. రాజకీయాల పరంగా మా దారులు వేరైనా. సినిమాపరంగా ఆయనంటే నాకు చాలా ఇష్టం అన్నారు. మీరు లేక పోతే పవన్ కళ్యాణ్ లేడు అంటూ అభిమానులను ఉద్దేశించి అన్నారు పవన్. నేను సినిమా చేస్తే ప్రత్యేక్షంగా 300 మంది బ్రతుతారు. పరోక్షంగా మరో 500 మంది బ్రతుకుతారు అందుకోసం నేను సినిమాజ చేస్తా.. సినిమా అనేది.. చేసే పని పైన ప్రేమ ఉంటే సినిమా తప్పకుండ విజయం సాధిస్తుంది. అలాంటి దర్శకులంటే నాకు చాలా ఇష్టం.
సీఎం అంటే అది జరగాలి అనుకుంటే అవవలేం.. మీ గుండెల్లో స్థానం సంపాదిస్తానని అనుకోలేదు కానీ సాధించా.. పదవి కోసం నేను వెంపర్లాడను. మీ గుండెల్లో చోటు దక్కించుకోనున్న అది ఈ జీవితానికి చాలు అన్నారు పవన్
ఏ వృత్తి ఎక్కువ కాదు ఏ వృత్తి తక్కువ కాదు.. నాకు చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్లంటే చాలా ఇష్టం అన్నారు పవన్. నేను కోరుకున్నది నా జీవితం లో జరగలేదు. నేను ఒక దిగువ మధ్య తరగతి జీవితాన్ని గడుపుదామనుకున్న అది తప్ప అన్ని జరిగాయి నాజీవితంలో అన్నారు పవన్. అలాగే నేను సినిమాలు కావాలని నాకు సినిమా చేయండి అని ఎవ్వరిని యాచించలేదు అన్నారు పవన్
పొలిటికల్ సభల్లో మాట్లాడుతా కానీ ఇక్కడ నేను బండ్ల గణేష్ లా ఎక్కడ మాట్లాడగలుగుతా.. నేను సినిమాలు మూడు సంవత్సరాలు చేయలేదంటే.. నాకు అలా అనిపించడంలేదు. నా గుండె ఎప్పుడు దేశం కోసం .. సినిమాకోసం.. మీకోసం కొట్టుకుంటుంది అన్నారు పవన్.
శివమణి కోరిక మేరకు ఆయనతో కలిసి డ్రమ్స్ వాయించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
126 సినిమాలతర్వాత నేను పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తున్నా అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. త్రివిక్రమ్ గారు ఎంతోమందికి స్క్రిప్ట్ రాశారు కానీ నాకు నా రాతనే మార్చారు అన్నారు తమన్. ఆయనతో రెండో సినిమా చేస్తున్న అయ్యప్పన్ కోషియమ్ సినిమాకు కూడా నేను మ్యూజిక్ చేస్తున్నా ఈ సినిమాలో లేని మాస్ ను ఆ సినిమాలో చూపిస్తా అన్నారు.
నాకు ఈ సినిమా అవకాశం దిల్ రాజు గారు, త్రివిక్రమ్ గారివల్ల వచ్చింది. నేను చిన్ననాటినుంచే పవన్ కళ్యాణ్ గారి అభిమానిని నేను గర్వంగా చెప్పుకుంటా అని అన్నారు వేణు శ్రీరామ్. నా డిగ్రీలో తొలిప్రేమ సినిమా నాలుగు షోలు వరుసగా చూసాను అన్నారు వేణు శ్రీరామ్. వకీల్ సాబ్ సినిమాలో ప్రతిదీ నాకు విలువైనది అన్నారు వేణు శ్రీరామ్.
ఖుషి సినిమానుంచి అనుకుంటున్నా ఎప్పటికైన పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలనుకున్న.. ఆతర్వాత ఆర్య సినిమా అప్పుడు పవన్ కళ్యాణ్ ను చూసాను అప్పుడు మళ్ళీ సినిమా చేయాలనీ అనుకున్న కానీ ఎందుకో కుదరలేదు.. పవన్ రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు నేను ఆ ఛాన్స్ మిస్ చేసుకున్న అనుకున్న… కానీ హరీష్ శంకర్ చెప్పినట్టు సంకల్పం గొప్పది అందుకే నాకు ఛాన్స్ వచ్చింది. ఆ అవకాశం పింక్ రీమేక్ కు ఛాన్స్ వచ్చింది. బోనికపూర్ తమిళ్ లో చేశారు అప్పుడు ఆ ట్రైలర్ చూసిన తర్వాత నేను పవన్ కళ్యాణ్ గారినే అనుకున్న.. తమిళ్ లో చూసినప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారినే చూసా..అన్ని అనుకున్నట్టుగా కుదిరాయి. ఈ సినిమా రేపును థియేటర్స్ లో చూస్తే మీరు కాలర్ ఎగరేస్తారు అన్నారు దిల్ రాజు..
పవన్ ఒక వ్యసనం .. అలవాటు పడితే వదిలించుకోలేము.. పవన్ చూడని బ్లాక్ బస్టర్లా .. ఆయన చూడని హిట్లా అంటూ పవన్ ను ఆకాశానికి ఏతేసిన బండ్లగణేష్. రోజుకు 18 గంటలు పనిచేస్తూ.. 1200ల మందికి సాయం చేస్తున్నారంటూ బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. ఏడుకొండల వాడికి అన్నమయ్య.. శివుడికి కన్నప్ప.. శ్రీరాముడికి హనుమంతుడు..పవన్ కళ్యాణ్ కు బండ్లగణేష్ అని సగర్వాంగా చెప్పుకుంటా అంటూ బండ్ల చెప్పారు. బండ్ల మాటలకూ పవన్ నవ్వు ఆపుకోలేక పోయారు. పవన్ తోపాటు ఆయన అభిమానులు అంతా బండ్ల గణేష్ స్పీచ్ కు కేకలతో శిల్పకళావేదిక దద్దరిల్లేనింది..
ఈ సినిమాలో మగువ మగువ సాంగ్ కు తమదైన శైలిలో.. వాయిదాలతో అద్భుతంగా పడిన మహిళలకు పవన్ కళ్యాణ్ లేచి మరి చప్పట్లు కొట్టారు. చేతులెత్తి వారికీ నమస్కరించాడు పవన్
చాలా రోజుల తర్వాత వచ్చిన చాలా పెద్ద పండగ ఇది అన్నారు హరీష్ శంకర్ ..లాక్ డౌన్ తర్వాత ఎలాంటి అధికారం లేకుండా పవన్ కళ్యాణ్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ సినీకార్మికుల అండగా నిలిచారు అన్నారు హరీష్ శంకర్.
పవన్ కళ్యాణ్ ఎంట్రీ తో హోరెత్తిన శిల్పకళావేదిక.. పవర్ స్టార్… పవర్ స్టార్ అంటూ నినాదాలతో రచ్చ చేసిన అభిమానులు.
వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్.
తెలుగమ్మలకు తెలుగు సినిమాల్లో ఛాన్స్ రాదు అని అందరు అంటుంటారు.. కానీ వకీల్ సాబ్ టీమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నాలాంటి ఎంతో మంది తెలుగు అమ్మాయిలకు హోప్ ఇచ్చారు అని చెప్పుకొచ్చింది అనన్య. వకీల్ సాబ్ సినిమా జర్నీని నా లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను అంది అనన్య. అలాగే పవన్ కళ్యాణ్ తనకు చాలా సపోర్ట్ చేసారని ఆయన మాటలను ఎప్పటికి మర్చిపోలేను అంది అనన్య.
ప్రాణాల లెక్కచేయకుండా ఇద్దరు ప్రాణాలను కాపాడిన చిన్నారి రుచిత కు వకీల్ సాబ్ ప్రైరీలీజ్ ఈవెంట్ వేదిక పై ఘనంగా సన్మానం జరిగింది. ఆ చిన్నారి మాట్లాడుతూ.. స్కూల్ బాస్ రైలు పట్టాలపై ఆగిన సమయంలో ఇద్దరు పిల్లలను ఎలా కాపాడిందో వివరించింది. తన ప్రాణాలు కాపాడుకోవడం కంటే ముందు ఇద్దరిని కాపాడిన రుచిత నిజంగా గ్రేట్..
ఇంతమందిని చూస్తే ఏమ్మాట్లాడాలో కూడా అర్ధంకావడం లేదు అన్నారు సాగర్ చంద్ర. ఏప్రిల్ 9న సినిమా విడుదలవుతుంది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అన్నారు సాగర్ చంద్ర
సినిమా జనల మధ్య సినిమా చూసి వన్ ఇయర్ అయ్యయిందన్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఏప్రిల్ 9న రియల్ పవర్ ఏంటో తెలుస్తుంది అన్నారు సురేందర్ రెడ్డి
సమాజ సేవ చేస్తూ… ఎంతో మందికి విద్యదానాన్ని చేసిన పద్మావతి గారిని సైరా దర్శకుడు సురేందర్ రెడ్డి, క్రిష్ వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికపై సన్మానించారు.
పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టమన్నారు నిర్మాత ఏ ఎం రత్నం. సినిమాలలోను, రాజకీయాలను పవన్ చాలా కష్టపడుతున్నారు అన్నారు రత్నం. పవన్ ఎన్ని రీమేక్ లు చేసిన అది రీమేక్ లా ఉండదు. అది పవన్ స్టైల్ లో ఉంటుంది.
టాలీవుడ్ లో పవన్ ఫిలిం ఫెస్టివల్ మొదలవబోతుందన్న క్రిష్. అది వకీల్ సాబ్ తో జయభేరి మ్రోగించనుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందన్నారు దర్శకుడు క్రిష్.
డీఐజీ సుమతి ని సత్కరించిన దిల్ రాజు , హీరోయిన్స్ అంజలి, అనన్య . సుమతి మాట్లాడుతూ.. వకీల్ సాబ్ సినిమా మగాళ్ల ఆలోచన విధానాన్ని మారుస్తుందని తెలిపారు.
డీఐజీ సుమతి ని సత్కరించిన దిల్ రాజు , హీరోయిన్స్ అంజలి, అనన్య
వకీల్ సాబ్ ఈవెంట్ కు హాజరైన బండ్ల గణేష్.. పవన్ ను దేవుడిగా భావించే బండ్ల గణేష్ ఏం మాట్లాడుతాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్..
వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు హోస్ట్ గా వ్యవరిస్తున్న యాంకర్ సుమ.. తనదైన మాటలతో ఆకట్టుకుంటున్న సుమ
సింగర్స్, మ్యుజీషన్స్ తో స్టేజ్ పైన సందడి చేస్తున్న సంగీత దర్శకుడు తమన్..
వకీల్ సాబ్ సినిమాలు అద్భుతమైన బాణీలు అందించాడు సంగీత దర్శకుడు తమన్. ఈ సినిమానుంచి విడుదలైన మగువ మగువ సాంగ్ మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది.
వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరైన నిర్మాత దిల్ రాజు… బోనికపూర్ తో కలిసి ‘వకీల్ సాబ్’ ను నిర్మిస్తున్న దిల్ రాజు
పవన్ కళ్యాణ్ స్పీచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులు.. సినిమా గురించి అభిమానుల గురించి ఏం మాట్లాడుతారా..? అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్..
పవన్ కళ్యాణ్ ను చూసేందుకు వేయికళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులు.. శిల్పకళా వేదిక వద్దకు భారీగా చేరుకుంటున్న అభిమానులు..
శిల్పకళా వేదికలో సందడి చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు.. పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్న అభిమానులు
శిల్పకళ వేదికలో సందడి చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు.. పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్న అభిమానులు