కరోనా ప్రభావం టాలీవుడ్‌పై చాలా పడింది. ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో టాలీవుడ్‌లో దాదాపుగా అన్ని సినిమా షూటింగ్ వాయిదా పడింది. అంతేకాదు పలు మూవీల విడుదల తేదీలు కూడా పోస్ట్‌పోన్ అయ్యాయి. ఇదిలా ఉంటే కరోనా ఎఫెక్ట్ మిగిలిన వారి కంటే దిల్ రాజుపై కాస్త ఎక్కువగానే పడింది. ఎందుకంటే నాని, సుధీర్ బాబులతో ఆయన నిర్మించిన వి మూవీని మొదటగా ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ కరోనా నేపథ్యంలో ఈ మూవీ విడుదల వాయిదా పడింది. ఇక మరోవైపు పవన్ కల్యాణ్‌తో ఆయన నిర్మిస్తోన్న వకీల్ సాబ్‌ను మేలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు.
కానీ ఇప్పుడు షూటింగ్‌లకు బ్రేక్ పడింది. దానికి తోడు ఏప్రిల్‌లో తన డేట్లను దర్శకుడు క్రిష్‌కు ఇచ్చారు పవన్. దీంతో దిల్ రాజు కాస్త డైలమాలో పడ్డారట. క్రిష్ మూవీ పూర్తి చేసుకొని వచ్చే సరికి మరింత ఆలస్యం అవుతుందని.. దాని వలన వకీల్ సాబ్ విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఆయన డైలమాలో పడ్డారట. అయితే ఈ విషయంలో పవన్ దిల్ రాజుకు మాటిచ్చారట. మొదట వకీల్ సాబ్‌ను పూర్తి చేసిన తరువాతే క్రిష్ మూవీ షూటింగ్‌లో పాల్గొంటానని చెప్పారట. దీంతో దిల్ రాజు కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా పింక్ రీమేక్‌గా వకీల్ సాబ్ తెరకెక్కుతోంది. ఇందులో పవన్ సరసన శ్రుతీ హాసన్ మూడోసారి రొమాన్స్ చేస్తోంది. నివేథా థామస్, అంజలి తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. పవన్ రీ ఎంట్రీ మూవీగా తెరకెక్కుతోన్న వకీల్ సాబ్‌పై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి.
Read This Story Also: పవన్, రాజమౌళి, ఎన్టీఆర్‌లపై ‘కేజీఎఫ్’ దర్శకుడి ఇంట్రస్టింగ్ కామెంట్స్..!