ప్రజా సంక్షేమం కోసం.. చాతుర్మాస దీక్ష

అనుకోకుండా వచ్చిన కరోనా మహమ్మారితో ప్రపంచమంతా ఇప్పుడు పెద్ద విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది. చిన్న, పెద్ద తేడా లేకుండా చాలా దేశాల్లో కరోనా విస్తరించింది.

ప్రజా సంక్షేమం కోసం.. చాతుర్మాస దీక్ష
Follow us

| Edited By:

Updated on: Jul 02, 2020 | 4:06 PM

అనుకోకుండా వచ్చిన కరోనా మహమ్మారితో ప్రపంచమంతా ఇప్పుడు పెద్ద విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది. చిన్న, పెద్ద తేడా లేకుండా చాలా దేశాల్లో కరోనా విస్తరించింది. దీంతో అన్ని దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజల సంక్షేమం కోసం పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పవన్‌ చాతుర్మాస దీక్షను చేపట్టారు. ఆకాడ శుక్ల తొలి ఏకాదశి సందర్భంగా బుధవారం పవన్ తన దీక్షను ప్రారంభించారు.

ఈ దీక్ష నాలుగు నెలల పాటు కొనసాగనుండగా.. కార్తీక శుక్ల ఏకాదశి రోజున ముగియనుంది. ఇక చివరి రోజున హోమం నిర్వహించబోతున్నట్లు సమాచారం. కాగా ఈ దీక్షలో పవన్ మాంసాహారాన్ని ముట్టబోరు. అలాగే రోజుకు ఒక పూట మాత్రమే ఆయన భోజనం తీసుకోనున్నారు. మధ్యలో కూడా హోమాలు నిర్వహించనున్నట్లు తెలలుస్తోంది. కాగా ప్రస్తుతం పవన్, మూడు చిత్రాలకు ఓకే చెప్పగా.. ప్రస్తుత పరిస్థితులు సర్దుకున్న తరువాత ఆయన సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశం ఉంది.