Pawan Kalyan: ఘనంగా ప్రారంభమైన పవన్‌-సుజీత్‌ మూవీ.. అంచనాలు పెంచేసిన వర్కింట్ టైటిల్..

|

Jan 30, 2023 | 4:46 PM

పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, సుజీత్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఇలా ప్రకటన వచ్చిందో లేదో అలా అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ప్రభాస్‌తో సుజీత్‌ చేసిన సాహో చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో ఎలాంటి ఇంపాక్ట్ చూపించిందో ప్రత్యేకంగా...

Pawan Kalyan: ఘనంగా ప్రారంభమైన పవన్‌-సుజీత్‌ మూవీ.. అంచనాలు పెంచేసిన వర్కింట్ టైటిల్..
Pawan Kalyan
Follow us on

పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, సుజీత్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఇలా ప్రకటన వచ్చిందో లేదో అలా అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ప్రభాస్‌తో సుజీత్‌ చేసిన సాహో చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో ఎలాంటి ఇంపాక్ట్ చూపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా బాలీవుడ్‌ ప్రేక్షకులను ఈ సినిమా మెస్మరైజ్‌ చేసింది. దీంతో ప్రస్తుతం సుజీత్‌, పవర్‌ స్టార్‌తో చేతులు కలపడంతో పవన్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. పవన్‌ పాన్‌ ఇండియా మూవీకి ఇది పర్‌ఫెక్ట్ అని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచనలో ఉన్న చిత్ర యూనిట్ మూవీని ప్రారంభించింది. సోమవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి థమన్‌ హాజరుకావడంతో ఈ చిత్రానికి సంగీత దర్శకుడు థమన్‌ అని తెలుస్తోంది. ఇక చిత్ర నిర్మాత డివివి దానయ్యతో పాటు అల్లు అరవింద్‌, దిల్‌రాజు, సురేశ్‌ బాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ చిత్రాన్ని ‘ఓజీ’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఒరిజినల్ గ్యంగ్ స్టర్ అనే వర్కింగ్ టైటిల్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించనున్నారన్న వార్తలకు బలం చేకూరుతోంది.

ఇవి కూడా చదవండి

ఇక సినిమా పూజా కార్యక్రమానికి హాజరైన పవర్‌ స్టార్‌ స్టన్నింగ్ లుక్‌లో కనిపించారు. ఫుల్‌ బ్లాక్‌ డ్రస్‌లో కొత్త లుక్‌తో మెస్మరైజ్‌ చేశారు. పూజా కార్యక్రామానికి సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ షేర్‌ చేసింది. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేసి ఇదే ఏడాది చివర్లో ఈ సినిమాను రిలీజ్‌ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్‌ చేస్తోంది. ఇక భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ఎలాంటి కాంప్రమైజ్‌ లేకుండా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..