వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఇప్పటీకే వకీళ్ సాబ్ మూవీ షూటింగ్ పూర్తైంది. దీంతో పవన్ నటించిన ఆ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ తర్వాత పవన్ అయ్యప్పమ్ కోషియం మూవీ రీమేక్‌లో నటించనున్నాడు. ఇటీవలే ఆ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా అట్టహసంగా జరిగాయి. ఇక తాజాగా తను నటించబోయే మరో సినిమా షూటింగ్‌ను కూడా ప్రారంభించాడు పవన్.
ఇటీవల కరోనా భారీన పడిన డైరెక్టర్ క్రిష్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. దీంతో తిరిగి సినిమాలపై దృష్టి పెట్టాడు. తాజాగా పవన్‌తో కలిసి మరో ప్రాజెక్ట్ చేయబోతున్నాడు ఈ డైరెక్టర్. ఇక పవన్ కళ్యాణ్‌తో కలిసి సోమవారం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభించాడు. దాదాపు నెల రోజులలో ఈ మూవీని పూర్తి చేసేలా క్రిష్ ప్లాన్ చేసుకున్నాడు. ఇక క్రిష్ తెరకెక్కించిన ఎన్టీఆర్ అంతగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. దీంతో పవన్‌తో తీయబోయే సినిమాతో హిట్ సాధించాలని కసిగా అనుకుంటున్నాడు క్రిష్. చారిత్రాత్మక నేపథ్యంలో ఈ సినిమాను క్రిష్ తెరకెక్కిస్తుండగా.. ఇందులో వపన్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక పవన్ కూడా ఈ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు రెడీగా ఉన్నాడు. ఇందుకోసం 25 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చాడని తెలుస్తోంది. ఏఎం రత్నం నిర్మాణంలో ఈ మూవీ నిర్మిస్తున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ పర్మిషన్ తోనే ఆ సినిమా చేశా.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన డైరెక్టర్ క్రిష్
మరోసారి పాట పాడనున్న పవన్ కళ్యాణ్.. మరోస్టార్‌తో కలిసి పవర్ స్టార్… ఏ సినిమాకోసమంట