Leonardo DiCaprio: టైటానిక్‌ హీరో మనసు దోచుకున్న కేరళ చేప పిల్ల.. ‘యాదృచ్చికమే అయినా అంత తేలిక కాదు’

|

Jul 21, 2023 | 10:45 AM

ప్రముఖ హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో సోషల్ మీడియా పెట్టిన పోస్టు ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇంతకీ విషయమేమంటే.. కేరళలోని అలప్పుజా జిల్లాకు చెందిన..

Leonardo DiCaprio: టైటానిక్‌ హీరో మనసు దోచుకున్న కేరళ చేప పిల్ల.. యాదృచ్చికమే అయినా అంత తేలిక కాదు
Leonardo DiCaprio
Follow us on

ప్రముఖ హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో సోషల్ మీడియా పెట్టిన పోస్టు ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇంతకీ విషయమేమంటే.. కేరళలోని అలప్పుజా జిల్లాకు చెందిన అబ్రహం ఎ అనే వ్యక్తి 2020లో తన ఇంటి బావి నీటిలో అరుదైన చేపను కనుగొన్నాడు. మూడు సెంటీమీటర్ల పొడవున్న పాములాంటి గులాబీ రంగు చేప మంచినీటిలో జీవించే అరుదైన జీవి అని, ఇది భూగర్భ చేపల జాతికి చెందినదిగా యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ (KUFOS) పరిశోధకులు గుర్తించారు. ఈ రకమైన చేప జాతిని పాతాళ ఈల్ లోచ్ (పాంగియో పాథాల) అని పిలుస్తారు.

ఐతే పర్యావరణ ప్రియుడైన లియోనార్డో డికాప్రియో మంగళవారం ఈ పాతాళ ఈల్ లోచ్ చేప గురించి ఆసక్తికర పోస్టు షేర్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు.

‘మన చుట్టూ ఉండే అడవి ఒక్కోసారి కొత్త జీవజాలాన్ని పరిచయం చేస్తుంటుంది. కేరళకు చెందిన అబ్రహం అనే స్థానిక రంగస్థల దర్శకుడు స్నానం చేస్తూ కొత్త జాతి చేపను కనుగొన్నాడు. బయటి ప్రపంచానికి దాదాపు దృశ్యరహితమైన భూగర్భ మంచినీళ్లలో జీవించే పాతాల ఈల్ లోచ్ వంటి చేపల ఆవిష్కరణ యాదృచ్ఛికమే అయినప్పటికీ వాటి గురించి అందరికీ తెలిసేలా చేయడం అంత తేలికైన పని కాదు’ అని ఆస్కార్ విజేత లియోనార్డో డికాప్రియో తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. 2022లో యూకే ఆధారిత ఏజెన్సీ జాబితా చేసిన టాప్ 50 కొత్త చేప జాతుల్లో పాతాలా ఈల్ లోచ్ చోటు దక్కించుకుంది. దీంతో అది అంతర్జాతీయ దృష్టిని బాగా ఆకర్షించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.