Joyland Movie: పాకిస్థాన్‌లో ‘జాయ్ ల్యాండ్’ మూవీ సెగ.. బ్యాన్ ఎత్తివేసినా ఆగని నిరసనలు.. అసలు కథ ఏంటంటే..?

|

Nov 20, 2022 | 7:46 AM

జాయ్ ల్యాండ్.. అనే పాకిస్థాన్ చిత్రం వివాదాస్పదంగా మారింది. వ్యంగ్యంగా ఈ సినిమాకు ఈ పేరు పెట్టారనీ. ఇందులో పాకిస్థాన్ సంస్కృతీ సంప్రదాయాలకు విఘాతం కలిగించే అంశాలున్నాయన్నది అభ్యంతరం. దీంతో ఈ సినిమాపై బ్యాన్ విధించారు. ఇపుడీ బ్యాన్ కంటిన్యూ అవుతోందా? ఎత్తివేశారా? అనేది చూద్దాం..

Joyland Movie: పాకిస్థాన్‌లో ‘జాయ్ ల్యాండ్’ మూవీ సెగ.. బ్యాన్ ఎత్తివేసినా ఆగని నిరసనలు.. అసలు కథ ఏంటంటే..?
Joyland Controversy
Follow us on

Pakistani film Joyland Controversy: జాయ్ ల్యాండ్.. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ జ్యూరీ ప్రైజ్.. టొరంటో ఫిలిం ఫెస్టివల్ అఫిషియల్ సెలక్షన్, అకాడమీ అవార్డ్స్ అఫిషియల్ పాకిస్థానీ ఎంట్రీ, ఇన్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం కేటగిరి, మాస్టర్ పీస్ ఆఫ్ పాకిస్తానీ మూవీల్యాండ్, మార్వ్ లెస్లీ స్క్రిప్టెడ్ అండ్ యాక్టెడ్, స్పెక్టాక్యులర్ మూవీ ఆఫ్ రీసెంట్ టైమ్స్.. ఇలా చాలా చాలా విశేషాలను సొంతం చేసుకుని.. ఆస్కార్‌ స్థాయిలో ఉన్న పాకిస్థానీ మూవీ జాయ్ ల్యాండ్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ సినిమా స్వలింగ సంపర్కానికి సంబంధించినది కావడంతో మతవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. లాహోర్ లో నివసించే ఒక పాకిస్థానీ కుటుంబం చుట్టూ తిరిగే ఈ కథను బట్టీ చూస్తే.. డ్యాన్స్ థియేటర్లో నాట్యమాడే ఒక ట్రాన్స్ జెండర్ లేడీతో ప్రేమలో పడతాడు.. ఈ చిత్ర కథానాయకుడు. దీంతో ఇది గే కల్చర్ ను ఎంకరేజ్ చేస్తోందనీ. ఇది ఇస్లాం సంప్రదాయాలకు పాకిస్థానీ సంస్కృతికి విరుద్ధంగా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

అత్యంత అభ్యంతరకరమైన విషయాలను కలిగి ఉండటంతో స్థానిక థియేటర్లలో విడుదల చేయకుండా నిషేధించింది పాకిస్థాన్ సమాచార ప్రసార శాఖ. అయితే ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయనీ.. దక్షిణాసియాలో ఇలాంటి చిత్రం రావడం ఒక అరుదైన అంశమనీ అంటారు అంతర్జాతీయ సినిమాప్రేమికులు. ఈ విషయం గుర్తించిన పాకిస్థాన్ గవర్నమెంట్ ఈ చిత్రంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. ప్రస్తుతం స్వదేశంలో థియేటరికల్ రిలీజ్ కు దీనికున్న అడ్డంకులన్నీ తొలగించారు. అయితే అక్కడక్కడా కొన్ని సెన్సార్ కట్లు పడ్డాయి.

ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు మార్గం సుగమం అయ్యింది. వాక్ స్వాతంత్ర్యం ప్రాధమిక హక్కు.. అయితే అది చట్ట పరిధిలో ఉండాలని షాబాజ్ షరీఫ్ ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది ఆహ్వానించదగ్గ పరిణామంగా వర్ణిస్తున్నారు సినీ ప్రేమికులు. బ్యాన్ ఎత్తివేసినా సరే ఈ సినిమాపై వస్తున్న అభ్యంతరాలు నిరసనలైతే ఆగడం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం..