Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓటీటీలో రికార్డులు బద్దలు కొట్టిన ‘అయ్యనా మానే’ వెబ్ సిరీస్.. ఎక్కడ చూడొచ్చంటే.. 

కుషీ రవి, అక్షయ నాయక్, మానసి సుధీర్ ప్రధాన పాత్రలుగా రమేష్ ఇందిర దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘అయ్యనా మానే’. ఈ సిరీస్ కన్నడ, హిందీ, తమిళ భాషలలో ఇప్పటికే భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గ్రిప్పింగ్ ఫ్యామిలీ థ్రిల్లర్ ఇప్పుడు మే 16, 2025న తెలుగులో విడుదల కానుంది.

ఓటీటీలో రికార్డులు బద్దలు కొట్టిన ‘అయ్యనా మానే’ వెబ్ సిరీస్.. ఎక్కడ చూడొచ్చంటే.. 
Ayyana Mane
Follow us
Rajeev Rayala

|

Updated on: May 14, 2025 | 2:03 PM

కుషీ రవి, అక్షయ నాయక్, మానసి సుధీర్ ప్రధాన పాత్రలుగా రమేష్ ఇందిర దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘అయ్యనా మానే’. ఈ సిరీస్ కన్నడ, హిందీ, తమిళ భాషలలో ఇప్పటికే భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గ్రిప్పింగ్ ఫ్యామిలీ థ్రిల్లర్ ఇప్పుడు మే 16, 2025న తెలుగులో విడుదల కానుంది. దీంతో దక్షిణ భారతదేశం అంతటా ‘అయ్యనా మానే’ పరిధిని మరింత విస్తృతం కానుంది.

చిక్ మంగళూర్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ముగ్గురు కోడళ్ల రహస్య మరణాల చుట్టూ ఈ కథనం తిరుగుతుంది. ప్రతి మరణం కల దేవత కొండయ్యకు సంబంధించిన శాపం వల్లే జరుగుతుందని నమ్ముతుంటారు. జాజీ (ఖుషీ రవి) కుటుంబంలోకి ప్రవేశించినప్పుడు తన ప్రాణాలను బలిగొంటుందని ఇట్టే గ్రహిస్తుంది. నమ్మకమైన పనిమనిషి తాయవ్వ, సిన్సియర్ ఆఫీసర్ మహానేష్ మద్దతుతో ఇంటి రహస్యాలను బయటకు తీసుకు వస్తూ ఉంటుంది. సస్పెన్స్, థ్రిల్లర్‌, ఫ్యామిలీ అంశాలతో తెరకెక్కించిన ఈ కథ ఓటీటీలో అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ZEE5 కన్నడ ఒరిజినల్ సిరీస్ ‘అయ్యనా మానే’ రికార్డుల్ని క్రియేట్ చేసింది. IMDbలో 8.6 రేటింగ్‌తో ఈ వెబ్ సిరీస్ దూసుకుపోతోంది.

ఖుషీ రవి మాట్లాడుతూ .. ‘‘అయ్యనా మానే’లో భాగం కావడం ఆనందంగా ఉంది. నా పాత్ర సవాలుతో కూడుకుని ఉంటుంది. ఇలాంటి కన్నడ కథలను ప్రాముఖ్యతను కల్పించిన ZEE5, శ్రుతి నాయుడు ప్రొడక్షన్స్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.ఆడియెన్స్ మా వెబ్ సిరీస్ మీద, నా పాత్ర మీద కురిపిస్తున్న ప్రేమను చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు తెలుగులోకి రాబోతోంది. ఇది నాకు ఎంతో ఆనందం కలిగించే విషయం. ఇప్పుడు సౌత్ అంతటా కూడా మా సిరీస్ సత్తాను చాటుకుంటుంది’ అని అన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి