OTT Movie: ఓటీటీలో మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్! ఎక్కడంటే?
ఇజ్రాయెల్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘మ్యాగ్‌పీ’ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు చందన్. తనను చిన్నచూపు చూసిన, అవమానించిన వారిపై ఓ యువకుడి ఎలా పగ తీర్చుకున్నాడన్నదే ఈ సిరీస్ కథ. అయితే దీనికి క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేశారు.

గోవాతో పాటు అక్కడి చుట్టు పక్కల ప్రాంతాల్లో జరిగే నేరాల ఆధారంగా ఆసక్తికరంగా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. ఇటీవలే ఈ సిరీస్ టీజర్ ను రిలీజ్ చేయగా ఆడియెన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ‘నిశ్శబ్దం మోసపూరితంగా ఉంటుంది.. అది బయటకు కనిపించే దాని కంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది’ అనే డైలాగులు సిరీస్ పై ఆసక్తిని పెంచుతున్నాయి. విమర్శకుల ప్రశంసలు పొందిన ఇజ్రాయెల్ సిరీస్ ‘మాగ్పీ’ని హిందీ ప్రేక్షకుల కోసం అనువదిస్తున్నారు. అయితే ఇండియన్ ఆడియెన్స్ కోసం పూర్తిగా మార్పులు చేర్పులు చేసి ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. ఇద్దర విడిపోయిన అన్నదమ్ముల మధ్య జరిగే పోరు.. తమ చీకటి గతాన్ని ఎదుర్కోవలసి రావడం.. జ్ఞాపకశక్తి, వాస్తవికత మధ్యలో వారిద్దరూ నలిగిపోవడం వంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సిరీస్ సాగుతుంది. ఈవెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషించిన రోషన్ మాథ్యూ మాట్లాడుతూ.. ‘ ఇందులో ఎంతో ఎమోషన్ ఉంటుంది. ఈ కథలోని భావోద్వేగ తీవ్రత, గందరగోళం కింద ఉన్న నిశ్శబ్దం వంటి అంశాలనే ఇందులో నన్ను నటించేలా చేశాయి. అషు అనే పాత్రలో చాలా లేయర్స్ ఉంటాయి. క్షణానికో రకంగా మారుతుంటుంది. కానీ లోపల నిశ్శబ్ద తుఫాను ఉంటుంది. ఈ కథ అందరి హృదయాల్ని కదిలించడం కాకుండా వెంటాడుతుంది’ అని చెప్పుకొచ్చారు.
అజయ్ రాయ్ నిర్మాతగా.. చందన్ అరోరా దర్శకత్వం వహించిన ‘కన్‌ఖజురా’లో మోహిత్ రైనా, రోషన్ మాథ్యూ, సారా జేన్ డయాస్, మహేష్ శెట్టి, నినాద్ కామత్, త్రినేత్ర హల్దార్, హీబా షా, ఉషా నద్కర్ణి వంటి ప్రముఖులు నటించారు. ప్రశంసలు పొందిన ఇజ్రాయెల్ సిరీస్ మాగ్పీ ఆధారంగా ఈ షోను యెస్ స్టూడియోస్ లైసెన్స్‌తో సృష్టికర్తలు ఆడమ్ బిజాన్స్కీ, ఓమ్రీ షెన్హార్, డానా ఈడెన్‌లు డోనా, షులా ప్రొడక్షన్స్ నిర్మించారు. ‘కన్‌ఖజురా’ మే 30 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.
కంకజూర వెబ్ సిరీస్ టీజర్..
It’s fragile. It’s fatal. It’s coming. Kankhajura — Streaming on 30th May on Sony LIV.#KanKhajura #SoFragileYetSoFatal#MohitRaina @roshanmathew22 @sarahjanedias03 #TrinetraHaldarGummaraju #NinadKamat #MaheshShetty #HeebaShah pic.twitter.com/FxUDjHUsaW
— Sony LIV (@SonyLIV) May 2, 2025
తెలుగులోనూ స్ట్రీమింగ్!
#Kankhajura, a Hindi adaptation of the Israeli thriller #Magpie, premieres on @SonyLIV on May 30. This gripping series, set in Goa, follows two estranged brothers confronting their dark past, blurring the lines between memory and reality.#OTTRelease #KanKhajuraOnSonyLIV pic.twitter.com/cEFxYYVa1J
— OTTRelease (@ott_release) May 2, 2025
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.