యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మెకానిక్ రాకీ. యాక్షన్ హీరోగా విశ్వక్ సేన్ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. చేసిన సినిమాలతో డీసెంట్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. ఈ నగరానికి ఏమైంది సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన విశ్వక్ సేన్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యూత్ ను విశేషంగా ఆకట్టుకున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు విశ్వక్. ఇక రీసెంట్ గా మెకానిక్ రాకీగా అలరించాడు. రవితేజ ముళ్ళపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటించారు.
22 నవంబర్ న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు డీసెంట్ వసూళ్లను కూడా రాబట్టింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరక్కేక్కిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ తమ నటనతో పాటు అందంతోను ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. థియేటర్స్ లో మంచి టాక్ సొంతం చేసుకున్న మెకానిక్ రాకీ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుందని టాక్.
ప్రముఖ ఓటీటీ సంస్థ మెకానిక్ రాకీ సినిమాను ఫాన్స్ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. మెకానిక్ రాకీ సినిమా డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందని సమాచారం. అయితే ఈ మూవీ నెలరోజుల్లోపే స్ట్రీమింగ్ వచ్చేస్తుందని సమాచారం. డిసెంబర్ 19 న ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. థియేటర్స్ లో మంచి టాక్ సొంతం చేసుకున్న మెకానిక్ రాకీ ఓటీటీలో ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఈ సినిమా తర్వాత విశ్వక్ వరుసగా సినిమాలను లైనప్ చేశాడు. త్వరలోనే లైలా అనే సినిమాతో రానున్నాడు విశ్వక్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.