మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘గామి’. ఇప్పటివరకు ఎక్కువగా లవ్, యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాల్లోనే నటించిన విశ్వక్ ఇందులో సరికొత్తగా కనిపించాడు. విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఈ సినిమాలో అఘోరా పాత్రలో నటించి మెప్పించాడు విశ్వక్. అడ్వెంచెరస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన గామి సినిమా మార్చి 8న థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తక్కువ బడ్జెట్ తో తీసినా సినిమాలోని విజువల్స్, వీఎఫ్ఎక్స్ హై లెవల్ లో ఉన్నాయంటూ ప్రశంసలు వచ్చాయి. ఇక ఎప్పటిలాగే విశ్వక్ తన నటనతో అదరగొట్టాడంటూ రివ్యూలూ వచ్చాయి. థియేటర్లలో భారీగానే వసూళ్లు రాబట్టిన గామి సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. విశ్వక్ సేన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 సొంతం చేసుకుంది. మొదట ఏప్రిల్ 5 వ తేదీ నుంచే గామి సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నారని ప్రచారం సాగింది. అయితే దీనిపై సదరు ఓటీటీ సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా వస్తోన్న వార్తలప్రకారం గామి సినిమా మరో వారం ఆలస్యంగా ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏప్రిల్ 12వ తేదీ నుంచి విశ్వక్ సినిమా ఓటీటీలోకి రానుందని టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.
కార్తిక్ శబరీష్ నిర్మించిన గామి సినిమాలో విశ్వక్ సేన్ తో పాటు చాందిని చౌదరి, అభినయ, మొహమ్మద్ సమద్, హారిక, దయానంద్ రెడ్డి, శాంతిరావు, మయాంక్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నరేష్ కుమరన్ సంగీతం అందించారు. కాగా క్రౌడ్ ఫండింగ్ విధానంతో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తవడానికి దాదాపు ఆరేళ్ళు పట్టింది. గామి కథ విషయానికి వస్తే.. తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి కథతో సినిమా రాలేదన్నాడు విశ్వక్ సేన్. అందుకు తగ్గట్టుగానే గామి ఓ డిఫరెంట్ సినిమాగా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. అందుకే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆడియెన్స్.
World Digital Premiere#Gaami streaming soon on #Zee5#VishwakSenActor #ChandiniChowdary #KarthikSabaresh pic.twitter.com/W41pGZvZkp
— Television & Tollywood Updates (@TTUpdates360) April 2, 2024
#Gaami streaming soon on #ZEE5#VishwakSen #ChandiniChowdary pic.twitter.com/1kBGkXn8dX
— Telugu TV Updates (@telugutvupdts) April 2, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.