AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thangalaan OTT: ‘తంగలాన్’కు భారీ షాక్.. ముందుగానే ఓటీటీలోకి విక్రమ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

తమిళంలో తంగలాన్ ఈ సినిమా 100 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. సౌత్ లో సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో ఇటీవలే హిందీలోనూ డబ్ చేసి రిలీజ్ చేశారు. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన తంగలాన్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఇంతలోనే తంగలాన్ టీమ్ కు భారీ షాక్ తగిలింది.

Thangalaan OTT: 'తంగలాన్'కు భారీ షాక్.. ముందుగానే ఓటీటీలోకి విక్రమ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
Thangalaan Movie
Basha Shek
|

Updated on: Sep 14, 2024 | 7:25 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘తంగలాన్’. పా రంజిత్ తెరకెక్కించిన ఈ పీరియాడికల్ అడ్వెంచెరస్ థ్రిల్లర్ లో పార్వతి తిరువొత్తు, మాళవికా మోహనన్ కథానాయికలుగా నటించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న తెలుగు, తమిళంలో ఒకేసారి తంగలాన్ రిలీజైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చేశాయి. తమిళంలో తంగలాన్ ఈ సినిమా 100 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. సౌత్ లో సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో ఇటీవలే హిందీలోనూ డబ్ చేసి రిలీజ్ చేశారు. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన తంగలాన్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఇంతలోనే తంగలాన్ టీమ్ కు భారీ షాక్ తగిలింది. ఈ సినిమా హెచ్ డీ ప్రింట్ మొత్తం ఆన్ లైన్ లో లీక్ అయిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా పలు పైరసీ వెబ్ సైట్లలో దర్శనమిస్తోంది. దీంతో విక్రమ్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో ప్లాన్ మారినట్లు తెలుస్తోంది.

సాధారణంగా థియేటర్లలో రిలీజైన నాలుగు లేదా ఆరు వారాల తర్వాతే సినిమా ఓటీటీలోకి రావాలి. అలా ఆరు వారాల తర్వాతే తంగలాన్ సినిమా ఓటీటీలోకి రావాల్సి ఉంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 20 నుంచే దక్షిణాది భాషల్లో , 27వ తేదీ నుంచి హిందీ వెర్షన్ ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పటివరకు దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడు ఆన్‌లైన్ లో హెచ్ డీ ప్రింట్ లీక్ అయిపోయింది కాబట్టి ఈ తేదీల్లోనే తంగలాన్ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక రానుందని సమాచారం.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 20 నుంచి తంగలాన్ స్ట్రీమింగ్..

స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తంగలాన్ సినిమాను నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చారు

తంగలాన్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?