Varasudu OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘వారసుడు’.. అఫీషియల్ ప్రకటన వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‏కు సిద్ధమయ్యింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Varasudu OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న వారసుడు.. అఫీషియల్ ప్రకటన వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Varasudu

Updated on: Feb 17, 2023 | 12:30 PM

డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటేస్ట్ చిత్రం వారిసు.తొలిసారిగా విజయ్ నేరుగా తెలుగులో నటించిన ఈ మూవీని వారసుడు పేరుతో సంక్రాంతి కానుకగా తమిళంలో జనవరి 11న.. తెలుగులో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఈ సినిమాకు సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా ఇందులోని పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‏కు సిద్ధమయ్యింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 22న ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అలాగే తెలుగుతోపాటు.. తమిళం, హిందీలోనూ ఈ సినిమాను అందుబాటులోకి తీసుకువస్తున్నారట.

మరోవైపు ఓవర్సీస్ ప్రేక్షకుల కోసం ఈ సినిమా సన్ నెక్ట్స్ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఈ చిత్రాన్ని ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించగా.. ఇందులో జయసుధ, శ్రీకాంత్, శ్యామ్ యోగిబాబు తదితరులు కీలకపాత్రలలో నటించారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ విలన్ గా మెప్పించాడు.

ఇవి కూడా చదవండి

సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా దాదాపు రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ సినిమాతో రష్మిక తమిళంలో తొలి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతోపాటు తమిల్ స్టార్ హీరో అజిత్ నటించిన తునివు చిత్రం కూడా విడుదలై రూ. 200 కోట్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.