ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

ఓటీటీలో సినిమాలకు కొదవే లేదు ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. రకరకాల జోనర్స్ లో సినిమాలు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. థియేటర్స్ లో వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు విడుదలై భారీ విజయాలను అందుకుంటున్నాయి

ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..
Tollywood Movie

Updated on: Aug 16, 2025 | 1:00 PM

ఓటీటీలో ప్రస్తుతం కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి.ఎన్టీఆర్ హృతిక్ రోషన్ నటించిన వార్ 2 సినిమా ఆగస్టు 14న థియేటర్స్ లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ సినిమా కూడా ఆగస్టు 14న విడుదలైంది. వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ సినిమా కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ రెండు సినిమాలు ఇప్పటికే వందకోట్ల కలెక్షన్స్ ను దాటేశాయి. కూలీ మొదటి రోజే రూ. 150కోట్లకు పైగా వసూల్ చేసింది. అలాగే వార్ 2 రెండు రోజులకు రూ.100కోట్లు రాబట్టింది. ఇదిలా ఉంటే మరో వైపు ఓటీటీల్లోనూ కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. రీసెంట్ గా థియేటర్ లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్న ఓ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. స్టార్ హీరో క్రేజీ హీరోయిన్ కలిసి నటించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇంతకూ ఆ మూవీ ఏదంటే..

Chiranjeevi: అన్నయ్య నాకు దేవుడు.. లక్షరూపాయిల కోసం ఫోన్ చేస్తే కోటి ఇచ్చారు..

ఆ సినిమా ఎదో కాదు స్టార్ హీరో విజయ్ సేతుపతి , నిత్యామీనన్ కలిసి నటించిన తలైవా తలైవి. ఈ సినిమాను తెలుగులో మేడం, సార్‌ మేడమ్‌ అనే పేరుతో విడుదల చేశారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా.. తెలుగులోను మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు కామెడీ యాడ్ చేసి తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతుంది. సార్‌ మేడమ్‌ మూవీ ఓటీటీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.

ఇవి కూడా చదవండి

11ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్.. అప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఇప్పుడు ఎలా ఉందంటే..

పాండిరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను టీజీ త్యాగరాజన్ సమర్పణలో సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై సెంథిల్ త్యాగరాజన్ నిర్మించారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసింది. ఈ నెల 22నుంచి సార్ మేడమ్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

చూస్తే దిమాక్ ఖరాబ్ అవ్వాల్సిందే..! వర్షాకాలంలో వేడిపుట్టిస్తున్న సినిమా.. ఒంటరిగా మాత్రమే చూడండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.