
బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోని సినిమాలంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తన కెరీర్ లో ఎక్కువగా సీరియస్ జానర్ సినిమాలే చేసిన ఆయన తొలిసారి ఓ రొమాంటిక్ జానర్ మూవీలో నటించారు. అదే రోమియో. తెలుగులో లవ్ గురుగా విడుదలైంది. గద్దలకొండ గణేష్ మూవీ ఫేమ్ మృణాళిని రవి ఇందులో హీరోయిన్ గా నటించింది. వినాయక్ వైద్య నాథన్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ లవ్ గురు సినిమాను రిలీజ్ చేయడం విశేషం. థియేటర్లలో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్ ను బాగా మెప్పించింది. కలెక్షన్లు కూడా ఒక మోస్తరు గానే వచ్చాయి. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన లవ్ గురు సరిగ్గా నెలరోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందుస్తు ప్రకటన, సమాచారం లేకుండానే. విజయ్ ఆంటోని సినిమా తెలుగు హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (మే 10) నుంచే లవ్ గురు సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా లవ్ గురు ఒరిజనల్ వెర్షన్ రోమియో ఆహా తమిళ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో తెలుగు వెర్షన్ కూడా ఆహాలోనే వస్తుందని చాలామంది భావించారు. అయితే అనూహ్యంగా లవ్ గురు సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
లవ్ గురు సినిమాలో యోగి బాబు, వీటీవీ గణేశ్, ఇళవరసు, సుధ, తలైవాసల్ విజయ్, శ్రీజ రవి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. విజయ్ ఆంటోని సతీమణి మీరా ఆంటోని ఈ సినిమాను నిర్మించడం విశేషం. అలాగే భరత్ ధన శేఖర్ అందించిన పాటలు సంగీత ప్రియులను అలరించాయి. ఇక లవ్ గురు సినిమా కథ విషయానికి వస్తే.. మలేషియాలో సెటిల్ అయిన బిజినెస్ మెన్ అరవింద్ (విజయ్ ఆంటోని) తిరిగి ఇండియాకువస్తాడు. అక్కడ లీల (మృణాళిని రవి) ని చూసి ప్రేమలో పడతాడు. పెద్దల అనుమతితో పెళ్లి కూడా చేసుకుంటాడు. అయితే ఈ పెళ్లి లీలకు ఏ మాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. దీంతో లీల మనసును గెలిచేందుకు ట్రై చేస్తాడు. మరి అరవింద్ ప్రేమను లీల అర్థం చేసుకుందా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే లవ్ గురు సినిమాను చూడాల్సిందే.
Arivazhagan, Leela and a life they never expected!#RomeoOnPrime, watch nowhttps://t.co/WTmFdFtId3 pic.twitter.com/yiqxePzieX
— prime video IN (@PrimeVideoIN) May 10, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.