AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vidudala Part 1: ఓటీటీలోకి వెట్రిమారన్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీ .. విడుదల పార్ట్‌ 1 స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

తెలుగులో విడుదల పార్ట్‌ 1 గా విడుదలైన ఈ సినిమాలో ఇప్పటివరకు కమెడియన్‌గా నవ్వించిన సూరి హీరోగా నటించాడు. మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి పవర్‌ ఫుల్‌ క్యామియో రోల్‌లో కనిపించాడు. ఏప్రిల్ 15న తెలుగులో విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది.

Vidudala Part 1: ఓటీటీలోకి వెట్రిమారన్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీ .. విడుదల పార్ట్‌ 1 స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Vidudala Part 1 Movie
Basha Shek
|

Updated on: Apr 25, 2023 | 5:08 PM

Share

విచారణై (విచారణ), అసురన్‌, కాకముట్టై తదితర హిట్‌ సినిమాలతో స్టార్‌ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు వెట్రిమారన్‌. నిజ జీవితంలో జరిగిన అంశాలను ప్రేక్షకులకు నచ్చేలా సిల్వర్‌ స్ర్కీన్‌పై చూపించడం ఇతని ప్రత్యేక శైలి. అందుకే ఈ ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌కు సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. వెట్రిమారన్‌ నుంచి సినిమా వస్తోంది అనగానే ఓ రేంజ్‌లో అంచనాలు ఉంటాయి. అలాంటి అంచనాలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా విడుతలై పార్ట్ 1. తెలుగులో విడుదల పార్ట్‌ 1 గా విడుదలైన ఈ సినిమాలో ఇప్పటివరకు కమెడియన్‌గా నవ్వించిన సూరి హీరోగా నటించాడు. మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి పవర్‌ ఫుల్‌ క్యామియో రోల్‌లో కనిపించాడు. ఏప్రిల్ 15న తెలుగులో విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. పలువురు సినీ ప్రముఖులు సైతం సినిమా బాగుందంటూ కితాబిచ్చారు. తెలుగులో విడుదల సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా విడుదల చేశారు.

థియేటర్లలో అందరినీ ఆకట్టుకున్న విడుదల పార్ట్‌ 1 ఓటీటీ రిలీజ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ నిరీక్షనకు తెరపడనుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ 5 విడుదల మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. కాగా సోషల్‌ మీడియాలో వస్తోన్న రిపోర్ట్స్‌ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్‌ 28 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒక వేళ ఈ డేట్‌ కాకపోతే మే మొదటి వారంలోనైనా ఈ సూపర్‌ కాప్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ డిజిటల్‌ తెరపై సందడి చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో భవాని శ్రీ, చేతన్, గౌతం వాసుదేవ్ మీనన్, ఇళవరసు, బాలాజీ శక్తివేల్, ఇతరులు కీలక పాత్రలు పోషిమంచారు. మ్యాస్ట్రో ఇళయరాజా స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
కన్నది కాదు కసాయిది.. బస్టాండ్ పబ్లిక్ టాయిలెట్‌లో నవజాత శిశువు..
కన్నది కాదు కసాయిది.. బస్టాండ్ పబ్లిక్ టాయిలెట్‌లో నవజాత శిశువు..
మహిళలకు శుభవార్త తెలిపిన పోస్టల్ శాఖ
మహిళలకు శుభవార్త తెలిపిన పోస్టల్ శాఖ
ప్రామిసరీ నోటుపై సంతకం, వేలిముద్ర రెండూ ఉంటే చెల్లుతుందా..?
ప్రామిసరీ నోటుపై సంతకం, వేలిముద్ర రెండూ ఉంటే చెల్లుతుందా..?
వేసవి వేడికి చెక్ పెట్టే బేల్ షర్బత్ ఇది.. ఈజీగా తయారు చేసుకోండి
వేసవి వేడికి చెక్ పెట్టే బేల్ షర్బత్ ఇది.. ఈజీగా తయారు చేసుకోండి
30 ఏళ్ల క్రితం కుర్రాళ్లకు పిచ్చెక్కించింది.. ఇప్పటికీ ట్రెండింగ్
30 ఏళ్ల క్రితం కుర్రాళ్లకు పిచ్చెక్కించింది.. ఇప్పటికీ ట్రెండింగ్
హనుమంతుడు లేకుండా రాముడు కనిపించడని ఎందుకంటారు?
హనుమంతుడు లేకుండా రాముడు కనిపించడని ఎందుకంటారు?
కొన్ని దోసకాయలు చేదుగా ఎందుకు ఉంటాయి? నిజమిదే!
కొన్ని దోసకాయలు చేదుగా ఎందుకు ఉంటాయి? నిజమిదే!
వట సావిత్రి వ్రతం.. ఈసారి ఎప్పుడు? ఆ శుభ యోగాల విశేషాలేంటి?
వట సావిత్రి వ్రతం.. ఈసారి ఎప్పుడు? ఆ శుభ యోగాల విశేషాలేంటి?
అమ్మనీ ఉడుత ఎంత పనిచేసింది?ఏకంగా ఆర్ట్స్‌ కాలేజీలో 20మందిపై దాడి
అమ్మనీ ఉడుత ఎంత పనిచేసింది?ఏకంగా ఆర్ట్స్‌ కాలేజీలో 20మందిపై దాడి
దట్టమైన అడవిలోనే.. నిండు గర్భిణికి ఎంత కష్టమొచ్చే..
దట్టమైన అడవిలోనే.. నిండు గర్భిణికి ఎంత కష్టమొచ్చే..