టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠీ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. సుమారు ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇటలీలోని టుస్కానీ వేదికగా పెళ్లిపీటలెక్కారు. నవంబర్ 1న అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు మెగా, అల్లు కుటుంబ సభ్యులు, లావణ్య ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు అత్యంత సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. ఇక పెళ్లికి రాని వారి కోసం ఆదివారం (నవంబర్ 5)న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. సినీ, రాజకీయ ప్రముఖులందరూ ఈ ఫంక్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక వరుణ్, లావణ్యల పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ మెగా పెళ్లి వేడుకకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త తెగ వైరలవుతోంది. వరుణ్, లావణ్యల పెళ్లి తంతు మొత్తం ఓటీటీలో ప్రసారం కానుందని టాక్ వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు ఈ మెగా ఫ్యామిలీ పెళ్లి వేడుక డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను కొనుగోలు చేసిందని ప్రచారం సాగింది. తాజాగా ఈ వార్తలపై వరుణ్ తేజ్ టీమ్ స్పందించింది.
వరుణ్, లావణ్యల పెళ్లి వేడుక ఓటీటీలో ప్రసారం కానుందంటూ వస్తోన్న వార్తలను వరుణ్ తేజ్ టీమ్ ఖండించింది. దయచేసి ఇలాంటి నిరాధారమైన వార్తలను సృష్టించవద్దని, వ్యాప్తి చేయవద్దని కోరింది. కాగా ఓటీటీలో వరుణ్, లావణ్యల పెళ్లి వేడుక వస్తే చూసి ఆనందిద్దామని మెగా ఫ్యాన్స్ భావించారు. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదనడంతో చాలామంది నిరాశ చెందారు. గతంలో యాపిల్ బ్యూటీ హన్సిక పెళ్లి వేడుక మొత్తం ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే. అలాగే నయనతార- విఘ్నేష్ శివన్‌ల పెళ్లి తంతు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేసేందుకు భారీ డీల్ కుదిరినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
The ongoing speculations around the OTT rights of #VarunTej & #LavanyaTripathi‘s wedding are completely baseless and untrue.
Requesting everyone not to believe in such rumours and spread them.
– Team #VarunTej pic.twitter.com/khuGcVQvq8
— Team VarunTej (@TeamVarunTej) November 7, 2023
— Varun Tej Konidela (@IAmVarunTej) November 6, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.