
టీవీ రియాలిటీ షోస్, డ్యాన్స్ షోలతో బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఓంకార్. ఆ తర్వాత రాజుగారి గది సినిమాతో డైరెక్టర్‌గా అదృష్టం పరీక్షించుకున్నాడు. సమంత, నాగార్జునతో కలిసి ఓంకార్ తెరకెక్కించిన రాజుగారి గది 2 సినిమా అందరినీ ఆకట్టుకుంది. ఆతర్వాత తన తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా రాజుగారి గది 3 తీశాడు. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే డ్యాన్స్ ఐకాన్, సిక్త్స్‌సెన్స్, కామెడీ స్టార్స్, ధమకా వంటి టీవీ రియాలిటీషోస్‌కు క్రియేటర్‌గా, హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు ఓంకార్. ఇప్పుడు డిజిటల్ రంగంలోకి కూడా అడుగుపెడుతున్నారాయన. ఓ హార్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో మన ముందుకు రానున్నారు. మ్యాన్షన్ 24 పేరుతో తెరకెక్కుతోన్న ఈ సిరీస్‌లో వరలక్ష్మీ శరత్‌కుమార్ మెయిన్ రోల్‌లో నటిస్తోంది. అలాగే బిగ్‌బాస్ ఫేమ్ బిందుమాధవి , అవికాగోర్, అభినయ, రాజీవ్ కనకాల, అనీష్ కురువిల్లా, మానస్, అమర్‌దీప్ చౌదరి, సత్యరాజ్, అయ్యప్ప చౌదరి, విద్యుల్లేఖరామన్, మీనా కుమారి, రావు రమేష్.. ఇలా తెలుగు, తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటీనటులు సందడి చేయనున్నారు.
తాజాగా మ్యాన్షన్ వెబ్ సిరీస్‌కు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చీకటితో నిండిన ప్రదేశంలో ఓ పురాతన భవనం, పక్కనే వరలక్ష్మీ శరత్‌కుమార్ ముఖం చూపిస్తూ డిజైన్ చేసిన ఈ పోస్టర్ సిరీస్‌పై ఆసక్తిని పెంచుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మ్యాన్షన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కానుంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. రాజుగాది సినిమా ఫ్రాంఛైజీ తరహాలోనే మ్యాన్షన్ సిరీస్ కూడా హారర్ థ్రిల్లింగ్ కథనంతో సాగనుందని సమాచారం. ఓ పురాతన భవనంలోకి అడుగపెట్టిన యువతీ యువకులు, వారికి ఎదురైన అనుభవాలను ఆసక్తికరంగా చూపించనున్నారని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు ఓంకార్. తెలుగుతో పాటు తమిళ్‌లోనూ ఈ సిరీస్ తెరకెక్కుతోంది. త్వరలోనే మ్యాన్షన్ 24 సిరీస్‌కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.