కొణిదెల వారి కోడలు.. రామ్ చరణ్ భార్య ప్రముఖ వ్యాపార వేత్త ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన అభిప్రాయాలను, సామజిక అంశాలను తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతారు. తాజాగా ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా ఓ వెబ్ సిరీస్ పై ప్రశంసలను కురిపిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇంకా చెప్పాలంటే వెబ్ సిరీస్ కు రివ్యూ ఇచ్చింది. మరి మెగా కోడలని ఆకట్టుకున్న ఈ వెబ్ సిరీస్ ఏమిటంటే .. కొల్లిన్ డి’కున్హా దర్శకత్వం వహించిన కాల్ మీ బే సెప్టెంబర్ 6న ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిశ్రమ సమీక్షలను అందుకుంది. అయితే ఉపాసన కొణిదెల నుంచి మాత్రం కాల్ మీ బే అనే వెబ్ సిరీస్ ప్రశంసలు అందుకుంది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో లీడ్ స్టార్ అనన్య పాండేని ట్యాగ్ చేస్తూ.. తనకు వెబ్ సిరీస్ ఎంతగా నచ్చిందో తెలియజేసింది.
ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ లో ఈ వెబ్ సిరీస్ పై తనకున్న ఏర్పడిన ప్రేమను తెలియజేస్తూ కాల్ మీ బే అనే సిరీస్‌లోని అనన్య, ఆమె సహనటుల పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ సిరీస్‌లో అనన్య టైటిల్ క్యారెక్టర్ లాగా తాను ‘సోషల్ మీడియా జర్నలిస్ట్’గా మారాలనుకుంటున్న విషయం గురించి పేర్కొంటూ టీమ్ పై ప్రశంసల వర్షం కురిపించింది .
కాల్ మి బే వెబ్ సిరీస్ ను కొల్లిన్ డి’కున్హా దర్శకత్వం వహించారు, ఇషితా మోయిత్రా, సమీనా మోట్లేకర్, రోహిత్ నాయర్ వ్రాసిన కాల్ మీ బే సిరీస్ లో అనన్య పాండే ప్రధాన పాత్రలో నటించారు. భర్తతో గొడవ పడి విడిపోయిన ఓ ధనిక మహిళ చుట్టూ తిరుగుతుంది. భర్త నుంచి విడిపోయిన తర్వాత ఆమె ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంది.. సంపద కోల్పోయిన ఆ యువతి జీవితంలో ఎలాంటి మలుపు తిరిగాయి అన్న ప్రధాన అంశంతో ఈ సిరీస్ సాగుతుంది. ఈ సిరీస్ విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందలను అందుకుంది.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..