పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్వరలో ప్రభాస్ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తోన్న అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ గా హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ ఎపిసోడ్ నుంచి మరో ప్రోమో ను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో లో డార్లింగ్, బాలయ్య సరదా సంబంషణలను చూపించారు. ఈ ప్రోమోలో ప్రభాస్ చాలా హుషారుగా కనిపిస్తున్నారు. బాలయ్య కొంటె ప్రశ్నలతో ప్రభాస్ ను తికమక పెట్టారు. ఈ ప్రోమో చూస్తుంటే ఇక ఎపిసోడ్ ఏ రేంజ్ లో ఉంటుందో అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ప్రభాస్ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఈ ఎపిసోడ్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ అంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. బాలయ్య షోలో ప్రభాస్ లుక్ బాగా వైరల్ అయ్యింది. డార్లింగ్ వింటేజ్ లుక్ అదిరిపోయింది. ప్రభాస్ చాలా ఉత్సహంగా బాలయ్య షోలో సందడి చేశారు.
అయితే ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేయనున్నారు. మొదటి ఎపిసోడ్ లో కేవలం ప్రభాస్ మాత్రమే ఉంటాడు. ఆయనతో బాలయ్య చేసే సందడి, సరదా కబుర్లు చూపించనున్నారు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 30న స్ట్రీమింగ్ చేయనున్నారు. అలాగే రెండో పార్ట్ లో ప్రభాస్ తో పాటు అతని మిత్రుడు గోపీచంద్ కూడా జాయిన్ అవ్వనున్నాడు. ఈ ఇద్దరు ఇండస్ట్రీలో ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారు అన్నది ఈ ఎపిసోడ్ ను చూపించనున్నారు. ఇది జనవరి 6న స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ రెండు ఎపిసోడ్స్ కు అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే బిగినింగ్ అని.. రెండో పార్ట్ కు అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే ది కంక్లూజన్ అని పేరుపెట్టారు.