2018లో కేరళలో సంభవించిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన మలయాళ సినిమా 2018. జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోటొవినో థామస్ హీరోగా నటించాడు. కుంచకో బోబన్, అసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్ కీలక పాత్రలు పోషించారు. మే5న చిన్న సినిమాగా విడుదలైన 2018 మలయాళంలో వసూళ్ల వర్షం కురిపించింది. కేవలం 17 రోజుల్లోనే రూ.138 కోట్లు రాబట్టి అత్యధిక కలెక్షన్లు సాధించిన మలయాళ సినిమాగా రికార్డుల కెక్కింది. ఇక కర్ణాటకలోనూ మలయాళ వెర్షనే రూ.4 కోట్లు వసూలు చేసి.. ఆ రాష్ట్రంలో అత్యధిక వసూళ్లు సాధించి మలయాళ సినిమాల్లో రెండోస్థానంలో నిలిచింది. రోజురోజుకు రికార్డుల కొల్లగొడుతోన్న 2018 సినిమా మే 26న తెలుగులో కూడా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అదేవిధంగా హిందీ, కన్నడ, తమిళం వెర్షన్లు కూడా ప్రేక్షకులకు అందుబాటులో రానున్నాయి. అయితే తాజాగా ఈ 2018 సినిమా ఓటీటీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసిందట.
ఈక్రమంలో జూన్9 నుంచి సోనీ లివ్‌లో 2018 సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా 2018లో కేరళ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించడంతో లక్షల మంది రోడ్డున పడ్డారు. ఆనాటి ఘోర విపత్తు ఆధారంగానే 2018 సినిమాను రూపొందించారు. ప్రజలు తమని తాము రక్షించుకుంటూనే ఎదుటివారికి ఎలా సాయం చేశారు? అనే కథాంశాన్ని తీసుకుని ఎంతో హృద్యంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కావ్య ఫిల్మ్ కంపెనీ, పీకే ప్రైమ్ ప్రొడక్షన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.