Cinema : హీరోయిన్ ఇంట్లో సీక్రెట్ కెమెరా పెట్టిన ఆకతాయి.. ఆపై ఫోన్ హ్యాక్ చేసి.. చివరకు..

ప్రస్తుతం ఓటీటీల్లో సరికొత్త కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. వైవిధ్యభరితమైన కథలతో సినీప్రియులను ఆకట్టుకుంటున్నారు మేకర్స్. ఇప్పుడు ఓ సినిమా నెట్టింట తెగ హంగామా చేస్తుంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రానికి రోజు రోజుకీ మరింత రెస్పాన్స్ వస్తుంది..

Cinema : హీరోయిన్ ఇంట్లో సీక్రెట్ కెమెరా పెట్టిన ఆకతాయి.. ఆపై ఫోన్ హ్యాక్ చేసి.. చివరకు..
Date With Saie

Updated on: Jan 24, 2026 | 7:30 AM

ఓటీటీలో నిత్యం ఏదోక కొత్త కంటెంట్ చిత్రం ట్రెండింగ్ అవుతుంది. వైవిధ్యభరితమైన కథలతో రూపొందించిన మూవీస్ ఇప్పుడు సినీప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఓ మరాఠీ క్రైమ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ నెట్టింట తెగ వైరలవుతుంది. సెలబ్రెటీపై అభిమానం మితిమీరితే ఎలా ఉన్మాదంగా మారుతుందో చూపించే కథ ఇది. అదే డేట్ విత్ సాయి. మరాఠీలో తెరకెక్కించిన వెబ్ సిరీస్ ఇది. 2018లో మొత్తం 9 ఎపిసోడ్లతో ఈ సిరీస్ తెరకెక్కించారు. దీనికి జ్ఞానేష్ జోటింగ్ దర్శకత్వం వహించారు.ఇందులో సాయి తమ్హంకర్, రోహిత్ కోకాటే ప్రధాన పాత్రలు పోషించారు.

ఎక్కువ మంది చదివినవి : Trivikram : ఆ పాట విని ఆశ్చర్యపోయా.. తెలుగు డిక్షనరీ కొని మరీ అర్థం వెతికాను.. త్రివిక్రమ్ శ్రీనివాస్..

దాదాపు 2 గంటల 10 నిమిషాల నిడివి ఉన్న సినిమాగా ఎడిట్ చేసి 2025 డిసెంబర్ 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ ను పిచ్చిగా ఆరాధించే అభిమాని ఉన్మాదిగా మారి.. ఆమె వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి అనుక్షణం ఆమెను వేంటాడడం.. ఆమె ప్రతి కదలికను తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఏం చేశాడు.. ? అతడి నుంచి ఆమె ఎలా బయటపడింది ? అనేది సినిమా.

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu: అంత కష్టపడి సినిమా తీస్తే నిర్మాత మోసంతో ఎవరినీ నమ్మలేకపోతున్నా.. నటుడు రవిబాబు ..

కథ విషయానికి వస్తే.. సాయి తమ్హంకర్ .. మరాఠీ సినీపరిశ్రమలో స్టార్ హీరోయిన్. ఆమెకు రఘునాథ్ అనే వ్యక్తి వీరాభిమాని. కానీ అతడి అభిమానం క్రమంగా ఉన్మాదంగా మారుతుంది. ఆమె జీవితాన్ని సినిమా తీయాలనుకుంటాడు. ఆమెకు తెలియకుండానే తన ఇంట్లో సీక్రెట్ కెమెరాలు పెడతాడు. ఆ తర్వాత తనను తాను బ్యాంకర్ గా పరిచయం చేసుకుంటాడు. నెమ్మదిగా ఆమె ఫ్యోన్ హ్యాక్ చేసి వ్యక్తిగత విషయాలు తెలుసుకుంటారు. చివరకు అతడి గురించి తెలుసుకున్న హీరోయిన్ అతడి నుంచి ఆమె ఎలా బయటపడింది ? అనేది సినిమా.

ఎక్కువ మంది చదివినవి : Trivikram Srinivas: అతడు కెమెరా కోసమే పుట్టాడు.. నాకు ఇష్టమైన హీరో.. త్రివిక్రమ్ ప్రశంసలు..

ఎక్కువ మంది చదివినవి : అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసిన సాంగ్.. భాష అర్థం కాకపోయినా కుర్రాళ్లకు పిచ్చెక్కించేసింది.. ఆ గ్లామర్ హీరోయిన్ ఏం చేస్తుందంటే..