
ప్రస్తుతం కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలు సైతం దూసుకుపోతున్నాయి. ఎలాంటి అంచనాలు, హడావిడి లేకుండా విడుదలైన సినిమాలకు ఇప్పుడు మంచి రెస్పా్న్స్ వస్తుంది. చాలాసార్లు సరైన ప్రమోషన్ లేకపోవడం.. పెద్ద చిత్రాల నుంచి పోటీ ఉండడం వల్ల నాణ్యమైన సినిమాలు అంతగా వెలుగులోకి రాకుండా పోతాయి. అయితే కొన్ని సందర్భాల్లో పలు చిత్రాలు థియేటర్లలో డిజాస్టర్స్ అవుతుంటాయి. కానీ ఓటీటీలో మాత్రం హిట్స్ అవుతుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా సైతం ఆ జాబితాలోకి చెందినదే. థియేటర్లలో అస్సలు పట్టించుకోలేదు. కానీ నెట్టింట మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆ సినిమా పేరు దండోరా.
ఎక్కువమంది చదివినవి : Anantha Sriram: యూత్‌కు పిచ్చేక్కించేసిన పాట.. ఆ సాంగ్‌తో నా జీవితమే మారిపోయింది.. రచయిత అనంత్ శ్రీరామ్..
థియేటర్లలో మంచి రెస్పాన్స్ రాకపోయినప్పటికీ ఓటీటీలో మాత్రం సత్తా చాటుతుంది. దండోర గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. కానీ ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో దూసుకుపోతుంది. కేవలం మూడు వారాల్లోనే అంటే జనవరి 14న అందుబాటులోకి వచ్చింది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శివాజీ, నవదీప్, బింధుమాధవి , రవికృష్ణ, నందు ప్రధాన పాత్రలు పోషించారు.
ఎక్కువమంది చదివినవి : Actor : అమ్మోరు సినిమా వల్లే నా కెరీర్‌ని నాశనం.. సగం షూట్ అయ్యాక.. నటుడు సంచలన కామెంట్స్..
క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలోని క్లైమాక్స్, ట్విస్ట్‌లు అభిమానులను బాగా కట్టిపడేసాయి. ఈ చిత్రానికి IMDBలో 9 కంటే ఎక్కువ పాయింట్లు వచ్చాయి. బలగం సినిమా తర్వాత ఆ స్థాయిలో జనాలను మెప్పి్స్తూ దూసుకుపోతుంది.
ఎక్కువమంది చదివినవి : Serial Actress : ఒడియమ్మ బంటీ.. త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఒకప్పుడు తోపు హీరోయిన్.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు.. 3 పెళ్లిళ్లు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ..