OTT: ఈ ఒక్క రోజే ఓటీటీలోకి 19 సినిమాలు.. ఆ రెండు సినిమాలు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి
శుక్రవారం వచ్చిందంటే చాలు ఓటీటీల్లో జాతర వాతావరణం కనిపిస్తుంది. పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీల్లో విడుదలై విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. భాషలతో సంబంధం లేకుండా పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీల్లో విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. తాజాగా ఈ వారం 19 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా థియటర్స్ లో సందడి చేస్తుంది, జూన్ 4న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన అన్ని ఏరియాల నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది. తొలి రోజే రూ.112కోట్లు వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది.. అలాగే వరల్డ్ వైడ్ గా రూ. 135.36 కోట్ల గ్రాస్ రాబట్టింది పెద్ది సినిమా.. పెద్ది థియేటర్స్ లో దుమ్మురేపుతుంటే ఓటీటీలోనూ కొన్ని సినిమాలు ఆకట్టుకుంటున్నాయి. నేడు ( శుక్రవారం )ఏకంగా 19 సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. వీటితో పాటు కొన్ని వెబ్ సిరీస్ లు కూడా విడుదలయ్యాయి.. వారం వారం ఓటీటీల్లో కొత్త సినిమాలు సందడి చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే ఈ వారం కూడా కొన్ని సినిమాలు ఓటీటీలోకి అడుగుపెట్టాయి. మరి ఆ సినిమాలు ఏంటో వాటిలో అస్సలు మిస్ అవ్వకూడని సినిమాలు ఏంటో ఒక్కసారి చూద్దాం.!
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
1. ది పిరమిడ్ స్కీమ్ – జూన్ 5
2. పీటర్ – జూన్ 5
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
3. 29 – జూన్ 5
4. మెక్సికో 86 – జూన్ 5
5. ఆఫీస్ రొమాన్స్ – జూన్ 5
6. టీచ్ యూ ఏ లెసన్ – జూన్ 5
7. ది మార్క్‌డ్ ఉమెన్ – జూన్ 5
ఆహా ఓటీటీ
8. అగ్లీ స్టోరీ- జూన్ 5
9. సత్తేంద్రు మారుధు వాణిలయ్ – జూన్ 5 (ఆహా తమిళ్ ఓటీటీ)
జీ5 ఓటీటీ
10. పేట్రియాట్ – జూన్ 5
11. కేడీ ది డెవిల్ – జూన్ 5
12. బ్రౌన్ – జూన్ 5
సన్ నెక్ట్స్ ఓటీటీ
13. ది రైజ్ ఆఫ్ అశోక – జూన్ 5
14. మెకానిక్ రాకీ – జూన్ 5
15. ధురంధర్ 2: ది రివేంజ్ – జియో హాట్‌స్టార్ ఓటీటీ- జూన్ 5
16. గుల్లాక్ సీజన్ 5 – సోనీ లివ్ ఓటీటీ- జూన్ 5
17. బీబీ ప్యారా – హోయ్‌చోయ్ ఓటీటీ- జూన్ 5
18. కేప్ ఫియర్ – ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- జూన్ 5
19. ది లై వుయ్ లివ్‌డ్ ఇన్ – వికి ఓటీటీ- జూన్ 5
ఈవారం ఓటీటీల్లో ఈ సినిమాలను అస్సలు మిస్ అవ్వకండి.. ముఖ్యంగా నందు, అవికా గోర్ నటించిన అగ్లీ స్టోరీ సినిమా థియేటర్స్ లో విడుదల సమయంలో బాగానే సందడి చేసింది. అలాగే ధురంధర్ 2సినిమా థియేటర్స్ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ రెండు సినిమాలు ఓటీటీలో అందుబాటులోకి వచ్చాయి.
