Japan Movie : ఓటీటీలోకి వచ్చేసిన జపాన్ తెలుగు వెర్షన్.. ఎక్కడ చుడొచ్చంటే

ఇప్పటికే చాలా సినిమాలు నెల రోజులకే ఓటీటీలో రిలీజ్ అయ్యి ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమా కూడా ఓటీటీలోకి వచ్చేసింది. కార్తీ హీరోగా నటించిన జపాన్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ముందుగా ఈ సినిమాను తమిళ్ వర్షన్ మాత్రమే ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు తెలుగు వర్షన్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.

Japan Movie : ఓటీటీలోకి వచ్చేసిన జపాన్ తెలుగు వెర్షన్.. ఎక్కడ చుడొచ్చంటే
Japan

Updated on: Dec 13, 2023 | 8:20 AM

థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తారో.. అవే సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తాయని అంతకు మిచ్చిన ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. ఇప్పటికే చాలా సినిమాలు నెల రోజులకే ఓటీటీలో రిలీజ్ అయ్యి ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమా కూడా ఓటీటీలోకి వచ్చేసింది. కార్తీ హీరోగా నటించిన జపాన్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ముందుగా ఈ సినిమాను తమిళ్ వెర్షన్ మాత్రమే ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు తెలుగు వెర్షన్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.

కార్తీ నటించిన సినిమాలనే తెలుగులో కూడా రిలీజ్ ఆవుతున్నాయి. కార్తీకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. తాజాగా జపాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తీ. రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించినన్ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. జపాన్ సినిమాలో కార్తీ డిఫరెంట్ లుక్ లో కనిపించి మెప్పించారు. అలాగే ఆయన స్లాంగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది.

తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమ రెండు భాషల్లో నిరాశపరిచింది. ఇక ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ జపాన్ సినిమా ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకుంది. జపాన్ సినిమాను నెట్ ఫ్లిక్స్  అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అయితే కేవలం తమిళ్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంచారు. ఇక ఇప్పుడు తెలుగు వర్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. నేటి( డిసెంబర్ 13) నుంచి జపాన్ తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంది.

కార్తీ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

కార్తీ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..