Tuck Jagadish: టక్‌ జగదీష్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడానికి కారణం అదే… నిర్మాత ఏం చెప్పారంటే..

|

Sep 05, 2021 | 12:05 PM

Tuck Jagadish: నాని హీరోగా రీతూ వర్మ, ఐశ్వర్య జంటగా తెరకెక్కిన చిత్రం టక్‌ జగదీష్‌. మజిలి, నిన్ను కోరి వంటి సూపర్‌ హిట్‌ చిత్ఆరల తర్వాత శివ నిర్వాణ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో...

Tuck Jagadish: టక్‌ జగదీష్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడానికి కారణం అదే... నిర్మాత ఏం చెప్పారంటే..
Follow us on

Tuck Jagadish: నాని హీరోగా రీతూ వర్మ, ఐశ్వర్య జంటగా తెరకెక్కిన చిత్రం టక్‌ జగదీష్‌. మజిలి, నిన్ను కోరి వంటి సూపర్‌ హిట్‌ చిత్ఆరల తర్వాత శివ నిర్వాణ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఈ చిత్రంపై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయని చెప్పాలి. అందుకు తగ్గట్లుగానే శివ ఈ సినిమాను యాక్షన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. నిజానికి ఈ సినిమాను తొలుత థియేటర్‌లోనే విడుదల చేయలాలని భావించినా చివరికి అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేయనున్నట్లు చిత్రి యూనిట్‌ ప్రకటించింది. ఈ సినిమా ఓటీటీ విడుదల అంశం అప్పట్లో నెట్టింట పలు కాంట్రవర్సీలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఇక వినాయక చవితి కానుకగా ఈ సినిమాను సెప్టెంబర్‌ 10న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా నిర్మాత సాహు గారపాటి తాజాగా మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

నిజానికి ఈ సినిమాను ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నామని కానీ.. కరోనాతో ఆశలు అడియాసలయ్యాయని గారపాటి తెలిపారు. ఇక ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి గల కారణాన్ని వివరించిన నిర్మాత.. ఇప్పుడు థర్డ్ వేవ్ భయాలు అందరిలోనూ ఉన్నాయని. ఇలాంటి పరిస్థితిలో సినిమాను జనాల వరకు తీసుకొస్తామా? లేదా? ఇంకెప్పుడు చూపిస్తామని అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తేనే అందరికీ చేరువవుతుంది. కానీ అన్ని చోట్ల ఇలాంటి పరిస్థితి లేదు.. అందుకే ఓటీటీకి వెళ్లాం. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ ఫలితం వల్ల మా అభిప్రాయం మారలేదు. ఆగస్టులో మేం థియేటర్‌కు రావాలని అనుకున్నాం. కానీ పరిస్థితులు చక్కబడే అవకాశం ఉన్నట్టు మాకు కనిపించలేదు. అందుకే ఓటీటీ నిర్ణయాన్ని తీసుకున్నాం. రెండు మూడు నెలల్లో అన్ని పరిస్థితులు చక్కబడతాయనే నమ్మకం ఉంది’ అని చెప్పుకొచ్చారు.

Also Read: Trisha: హీరోయిన్ త్రిషను వెంటనే అరెస్ట్ చేయాలి.. భగ్గుమన్న హిందూ సంఘాలు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Poonam Kaur: ‘అతను ఒక రాజకీయ నేరగాడు’… సంచలన ట్వీట్ చేసిన పూనమ్‌ కౌర్‌. ఇంతకా వ్యక్తి ఎవరు.?

Divi Vadthya: ‘ఈ కళ్లను చూస్తూ బతికేయొచ్చు’… కుర్రకారు మతి పోగొడుతోన్న అందాల దివి లేటెస్ట్‌ ఫొటోలు.