The Legend Of Hanuman OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘ది లెజెండ్ ఆఫ్ హనుమాన్’.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌.. ఎక్కడంటే?

హనుమాన్‌.. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ పాన్‌ ఇండియా మూవీకి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. హాలీవుడ్ లో బాగా ఫేమస్‌ అయిన సూపర్ మ్యాన్‌ కథను రామాయణం ఇతిహాసానికి ముడిపెట్టి హనుమాన్ ను తెరకెక్కించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది

The Legend Of Hanuman OTT: ఓటీటీలోకి వచ్చేసిన ది లెజెండ్ ఆఫ్ హనుమాన్.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌.. ఎక్కడంటే?
The Legend Of Hanuman Web Series

Updated on: Jan 13, 2024 | 10:32 AM

హనుమాన్‌.. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ పాన్‌ ఇండియా మూవీకి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. హాలీవుడ్ లో బాగా ఫేమస్‌ అయిన సూపర్ మ్యాన్‌ కథను రామాయణం ఇతిహాసానికి ముడిపెట్టి హనుమాన్ ను తెరకెక్కించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. తేజ సజ్జా, అమృతా అయ్యర్‌ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సూపర్‌ న్యాచురల్ థ్రిల్లర్‌ మూవీకి బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు వస్తున్నాయి. జనవరి 11న ప్రీమియర్‌ షోస్‌ పడగా, శుక్రవారం (జనవరి 12) రెగ్యూలర్‌ షోస్‌ కూడా జతయ్యాయి. దీంతో ఈ మూవీకి భారీగా వసూళ్లు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఓటీటీలోనూ హనుమాన్ అదరగొడుతున్నాడు. అయితే ఇది తేజా సజ్జా హనుమాన్‌ కాదు. ఆంజనేయుడి కథ తోనే తెరకెక్కిన యానిమేటెడ్‌ వెబ్‌ సిరీస్‌ ‘ది లెజెండ్‌ ఆఫ్‌ హనుమాన్‌’. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో ఈ యానిమేటెడ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అఅవుతోంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో వచ్చిన రెండు సీజన్లు సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యాయి. ఆంజనేయుడి భక్తులు ముఖ్యంగా పిల్లలకు ది లెజెండ్ ఆఫ్‌ హనుమాన్‌ సిరీస్ తెగ నచ్చేసింది. ఈ నేపథ్యంలో జనవరి 12 నుంచి ‘ది లెజెండ్ ఆఫ్ హనుమాన్’ మూడో సీజన్‌ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక్కడ విశేషమేమిటంటే ఈ సిరీస్‌ తొలి రెండు సీజన్లు తెలుగు స్ట్రీమింగ్‌ అందుబాటులోకి రాలేదు. అయితే మూడో సీజన్‌ మాత్రం తెలుగులోనూ స్ట్రీమింగ్‌ అవుతోంది.

అటు థియేటర్లు.. ఇటు ఓటీటీ.. ఇలా ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘హనుమాన్‌’ హవానే నడుస్తోంది. థియేటర్లలో తేజా సజ్జా హనుమాన్‌ అదరగొడుతుంటే.. ఓటీటీలోనూ ది లెజెండ్‌ ఆఫ్‌ హనుమాన్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. కాగా రెండో సీజన్‌ ముగిసిన సుమారు మూడేళ్ల తర్వాత హనుమాన్ యానిమేటెడ్‌ వెబ్ సిరీస్‌ మూడో సీజన్‌ రావడం గమనార్హం. రామాయణంలోని మనకు తెలియని ఎన్నో విషయాలను, విశేషాలను ఎంతో చక్కగా చూపించారు మేకర్స్‌. యానిమేషణ్‌ వెర్షన్‌ కావడంతో పిల్లలు కూడా ఈ సిరీస్‌పై బాగా ఆసక్తి చూపుతున్నారు. కొత్త సీజన్‌లో పిల్లలతో పాటు పెద్దలను కూడా అలరించే విధంగా తెరకెక్కించామని మేకర్స్ చెబుతున్నారు. మరి థియేటర్లలో హనుమాన్ టికెట్లు దొరకడం లేదా.. అయితే అప్పటివరకు ఇంట్లోనే కూర్చొని ఈ ది లెజెండ్ ఆఫ్‌ హనుమాన్‌ సిరీస్‌ను వీక్షించేయండి.

ఇవి కూడా చదవండి

‘ది లెజెండ్‌ ఆఫ్‌ హనుమాన్‌’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్..

&

తెలుగులోనూ స్ట్రీమింగ్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.