Sarkaar S5: మరోసారి ఆడియన్స్‌ను ఆకట్టుకోవడానికి రెడీ అయిన ఆహా.. సర్కార్ నయా సీజన్ మొదటి ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వకండి

డిజిటల్‌ రంగంలో 100 శాతం వినోదాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా . ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్ని సూపర్‌హిట్‌ సినిమాలు, థ్రిల్లింగ్ సస్పెన్స్ వెబ్ సిరీస్‏లను సినీ ప్రియులకు అందించింది. అలాగే అన్‌స్టాపబుల్‌ అంటూ టాక్‌షోలు, తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సింగర్‌ సింగింగ్‌ షోలను, సర్కార్ గేమ్ షోలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది.

Sarkaar S5: మరోసారి ఆడియన్స్‌ను ఆకట్టుకోవడానికి రెడీ అయిన ఆహా.. సర్కార్ నయా సీజన్ మొదటి ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వకండి
Sarkaar

Updated on: Jun 05, 2025 | 10:12 PM

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా.. తెలుగు కంటెంట్ తో దూసుకుపోతుంది. వరుసగా సూపర్ హిట్ సినిమాలు, ఆకట్టుకుంటే టాక్ షోలు, అలరించే గేమ్ షోలతో ఆహా పేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే గేమ్ షోలు, టాక్ షోల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇప్పటికే సర్కార్ గేమ్ షోతో ఎంతోమంది ప్రేక్షకులను కట్టిపడేసిన ఆహ ఇప్పుడు మరో సీజన్ తో అలరించడానికి రెడీ అవుతుంది. ఇక మరోసారి సర్కార్ షోకు సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

సుడిగాలి సుధీర్.! ఈ పేరు కాస్తా.. ఇప్పుడు మారబోతోంది. అది సర్కార్‌ సుధీర్‌గా ఫిక్స్ కాబోతోంది. ఆహా అనేలా.. రిపీటెడ్‌గా చూసేలా.. సర్కార్‌ మరో సీజన్‌ వచ్చేస్తోంది. మరింత ఎంటర్‌టైనింగ్‌గా ఆ సీజన్‌ ఈ సీజన్‌ రెడీ అయినట్టు తెలుస్తోంది. తెలియడమే కాదు.. ఇదే సీజన్‌కు సంబంధించి ఓ చిన్న గ్లింప్స్‌ బయటికి వచ్చింది. అది కాస్తా ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

సుధీర్‌తో మామూలుగా ఉండదు. అది జబర్దస్త్ షో నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సర్కార్‌ 5లో ఇదే మాట కాస్త గట్టిగానే వినిపించేలా ఉంది. ఈ సీజన్‌లో ప్రశ్నల మరింత వైల్డ్ గా ఉండనున్నాయనే హింట్ ఈ షో టీం నుంచి వచ్చింది. ప్రశ్నలే కాదు.. ఆన్సర్లు కూడా ఈసారి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఉంటాయనే చెబుతోంది. చెప్పడమే కాదు.. ఈ షోకు సంబంధించి రిలీజ్ అయిన గ్లింప్స్‌లో ఇదే కనిపిస్తోంది. ఫుల్ ఆన్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్మెంట్ లోడింగ్ అని తెలుస్తోంది. రేపు (జూన్ 6న ) సర్కార్ న్యూ సీజన్ మొదటి ఎపిసోడ్ లాంచ్ చేయనున్నారు. ఆహాలో స్ట్రీమింగ్ కానున్న సర్కార్ సీజన్ 5 మొదటి ఎపిసోడ్‌ను అస్సలు మిస్ అవ్వకండి.

సర్కార్ గేమ్ షో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.