Shreya Dhanwanthary: సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ లో అద్భుతమైన నటినతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది శ్రేయా ధన్వంతరి. స్కామ్ 1992, ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ రెండూ సూపర్ హిట్ సిరీస్లో తర్వాత శ్రేయా తన ఇంటి పేరుగా మార్చుకుంది. ఈ అమ్మడు ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. తాప్సీ పన్నూ, తాహిర్ రాజ్ భాసిన్ నటిస్తున్న లెటేస్ట్ చిత్రం లూప్ లాపేటా. ఇందులో ఓ కీలక పాత్ర కోసం..అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ కోసం చిత్రయూనిట్ అన్వేసిస్తుంది.
ఈ సినిమాలోని జూలియా పాత్ర కోసం శ్రేయా ధన్వంతరిని ఎంపిక చేసారట మేకర్స్. గతంలో ఎలిప్సిస్ తో కలిసి ఓ సినిమా చేసింది శ్రేయా ధన్వంతరి. ఈ సందర్భంగా .. శ్రేయా మాట్లాడుతూ.. నేను సినిమాలు చేయడానికి అనేక కారణాలున్నాయి. నాకు నటనపై ఆసక్తి ఎక్కువ. ఎలిప్పిన్, తనూజ, అతుల్ వంటి ప్రముఖులతో కలిసి నేను నటనలో మొదటి అడుగులు వేశాను. ఈమూవీ టైటిల్ చాలా లూపిగా ఉంది. కొత్త ప్రయోగాలు చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ సమయంలో లూప్ లాపేటాలో నటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఎలిప్సిస్ ఎంటర్ టైన్మెంట్స్, ఆయుష్ మహేశ్వరి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీని ఈ ఏడాది విడుదల చేయనున్నారు.
INDW vs ENGW: రెండేళ్ల తరువాత 200 దాటారు.. అయినా ఓడిన భారత మహిళలు.. సిరీస్ ఇంగ్లండ్ వశం..!