The Baker & The Beauty Trailer Review: రెండు భిన్నమైన మనసుల ప్రేమలో ఎన్నో భావోద్వేగాలు.. ఆహాలో ది బేకర్ అండ్ ది బ్యూటీ..

తెలుగు ప్రేక్షకులకు అనుక్షణం సరికొత్త వినోదాన్ని అందించే ఓటీటీ మాధ్యమం ఆహా.. మరోసారి సరికొత్త వెబ్ సిరీస్‏ను అందిస్తుంది. యంగ్ హీరో

The Baker & The Beauty Trailer Review: రెండు భిన్నమైన మనసుల ప్రేమలో ఎన్నో భావోద్వేగాలు.. ఆహాలో ది బేకర్ అండ్ ది బ్యూటీ..
The Baker The Beauty

Updated on: Sep 07, 2021 | 8:29 AM

తెలుగు ప్రేక్షకులకు అనుక్షణం సరికొత్త వినోదాన్ని అందించే ఓటీటీ మాధ్యమం ఆహా.. మరోసారి సరికొత్త వెబ్ సిరీస్‏ను అందిస్తుంది. యంగ్ హీరో సంతోష్ శోభన్, టీనా శిల్పరాజ్ జంటగా నటించిన  ది బేకర్ అండ్ ది బ్యూటీ   అనే ఆసక్తికరమైన వెబ్ సిరీస్ .. వినాయక చవితి సందర్బంగా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. రొమాంటిక్ డ్రామా రూపొందుతున్న ఈ సిరీస్ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‏ను విడుదల చేశారు మేకర్స్.

బేకరీ నిర్వహించే మిడిల్ క్లాస్ యువకుడు విజయ్ (సంతోష్ శోభన్).. మహి (విష్ణు ప్రియ) అనే అమ్మాయిని కాదని.. ఫిల్మ్ స్టార్ ఐరా వాసిరెడ్డి (టీనా) ప్రేమలో పడ్డాడు. ఇద్దరు భిన్న మససులైన బేకర్ అండ్ ఫిలిం స్టార్ మధ్య జరిగే ప్రేమ.. గొడవలు, భావోద్వేగాలతో అందంగా నిర్మించినట్లుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అలాగే జిందగీలో ఒకటి యాద్ పెట్టుకో తమ్ముడు.. పోరి ఎంత కిర్రాక్ ఉంటే అన్ని కష్టాలు వస్తాయి అనే డైలాగ్ యూత్‏ను అట్రాక్ట్ చేస్తుంది. ఈ సిరీస్‏కు జొనాథన్ ఎడ్వర్ట్స్ దర్శకత్వం వహించగా.. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు. ఇందులో వెంకట్, సాయి శ్వేత, సంగీత్ శోభన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఝాన్సీ లక్ష్మీ కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సిరీస్ నిర్మాణ విలువలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించగా. నిర్మాత సుప్రియా యార్లగడ్డ స్క్రిప్ట్ సూపర్ వైజర్‏గా చేశారు. దాదాపు ఈ సిరీస్ పది ఎపిసోడ్స్ ఉండబోతుంది.

ట్రైలర్..

Also Read: Vijay Devarakonda: మరోసారి సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏తో జతకట్టిన విజయ్ దేవరకొండ.. బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చేందుకు సన్నాహాలు..

Bigg Boss 5 Telugu: మూడేళ్లుగా మోసం చేస్తూనే ఉన్నా.. మరోసారి సెన్సెషనల్ కామెంట్స్ చేసిన ప్రియాంక..

Bigg Boss 5 Telugu: సీరియస్.. ఎమోషనల్‍గా నామినేషన్ ప్రాసెస్.. ఎలిమినేషన్ జోన్‏లోకి ఆరుగురు సభ్యులు ..