Thank You: అమెజాన్ ప్రైమ్‏లో చైతూ సినిమా.. ఆ రోజు నుంచే థాంక్యూ మూవీ స్ట్రీమింగ్..

రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో చైతూ మూడు విభిన్న పాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం చైతూ లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Thank You: అమెజాన్ ప్రైమ్‏లో చైతూ సినిమా.. ఆ రోజు నుంచే థాంక్యూ మూవీ స్ట్రీమింగ్..
Thank You

Updated on: Aug 09, 2022 | 6:32 PM

ఇటీవల థాంక్యూ (Thank You) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya). డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా.. ఆశించినంతస్థాయిలో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ కథానాయికలుగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు థాంక్యూ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‏కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్ట్ 11 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ థాంక్యూ స్పెషల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో చైతూ మూడు విభిన్న పాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం చైతూ లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించిన ఈ మూవీలో చైతూ సౌత్ అబ్బాయి బాలరాజు పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతో చైతూ.. బాలీవుడ అరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 11న హిందీతోపాటు.. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం భాషలలో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.