OTT Movie: గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అడ్డంగా బుక్ అయిన ప్రియుడు.. ఓటీటీలో గ్యాంగ్ లీడర్ బ్యూటీ రొమాంటిక్ మూవీ..

తెలుగులో ఇటీవల వచ్చిన ఓ రొమాంటిక్ కామెడీ మూవీ ఇప్పుడు ఆకస్మాత్తుగా ఓటీటీలోకి వచ్చింది. ఎలాంటి హడావిడి, ప్రకటనలు లేకుండా సైలెంట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రేమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. మార్చి మొదటి వారంలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..

OTT Movie: గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అడ్డంగా బుక్ అయిన ప్రియుడు.. ఓటీటీలో గ్యాంగ్ లీడర్ బ్యూటీ రొమాంటిక్ మూవీ..
14 Days Girlfriend Intlo

Updated on: Apr 04, 2025 | 1:03 PM

ఇటీవల తెలుగులో వచ్చిన రొమాంటిక్ కామెడీ సినిమా 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ఇ ఇంట్లో. నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో టీనేజ్ అమ్మాయిగా కనిపించిన శ్రియా కొంతం ఈ మూవీలో కథానాయికగా పరిచయమైంది. ఇందులో అంకిత్ కొయ్య హీరోగా నటించాడు. ఇందులో వెన్నెల కిషోర్, ఇంద్రజ ముఖ్యపాత్రలు పోషించగా.. శ్రీహర్ష మన్నే దర్శకత్వం వహించారు. తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను ఈతరం యువత ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. మార్చి మొదటివారంలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. కామెడీ బాగుందనే టాక్ వచ్చినప్పటికీ అంతగా మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది.

ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. శుక్రవారం నుంచి ఈ సినిమా తెలుగులో అందుబాటులోకి వచ్చింది. నాగచైతన్య నటించిన మజిలీ సినిమాతో నటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు అంకిత్ కొయ్యా. ఆ తర్వాత తెలుగులో అశ్వత్థామ, జోహార్, తిమ్మరుసు సినిమాల్లో కీలకపాత్రలు పోషించాడు. అలాగే పలు వెబ్ సిరీస్ సైతం చేశాడు.

14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో కథ విషయానికి వస్తే..
సినిమా డైరెక్టర్ కావాలని కలలు కనే హర్ష.. క్రియేటివ్ కిసెస్ యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తుంటాడు. డేటింగ్ యాప్ లో అహాన అనే అమ్మాయితో హర్షకు ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. ఊర్లో జరిగే ఓ పెళ్లికి పేరేంట్స్ వెళ్లడంతో హర్షను తన ఇంటికి పిలుస్తుంది అహాన. అయితే సడెన్ గా పెళ్లి క్యాన్సిల్ కావడంతో అహాన పేరెంట్స్ సడెన్ గా ఇంటికి తిరిగి వస్తారు. దీంతో తల్లిదండ్రుల కంట పడకుండా హర్షను తన రూంలో దాచేస్తుంది అహాన. అదే టైంలో కరోనా అనుమానంతో ఆమెతోపాటు తన ఫ్యామిలీ సైతం అధికారులు ఐసోలేషన్ సెంటర్ కు పంపిస్తారు. ఆ తర్వాత హర్ష పరిస్థితి ఏమైందీ.. ? 14 రోజులు గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది సినిమా.

ఇవి కూడా చదవండి : 

Tollywood: మరీ ఇంత క్యూట్‏గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‏కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..

Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..

Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..

Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..