Telugu Indian Idol S4: తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్ పై సందడి చేసిన మిత్రమండలి టీమ్..

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా.. కొత్త కంటెంట్ చిత్రాలను జనాల ముందుకు తీసుకువస్తుంది. అలాగే ఇతర భాషలలో హిట్టైన సినిమాలను సైతం తెలుగులో సినీప్రియులకు అందిస్తుంది. ఇక చాలా కాలంగా సరికొత్త గేమ్ షోస్, టాక్ షోలతో అలరిస్తుంది ఆహా.

Telugu Indian Idol S4: తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్ పై సందడి చేసిన మిత్రమండలి టీమ్..
Aha

Updated on: Oct 10, 2025 | 9:58 PM

అచ్చమైన తెలుగు కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా.. సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. కేవలం సినిమాలే కాదు.. ఆకట్టుకునే గేమ్ షోలు, అదరగొట్టే టాక్ షోలు.. కట్టిపడేసే వెబ్ సిరీస్ లతో దూసుకుపోతుంది ఆహా.. అలాగే ప్రతిభ కలిగిన సింగర్స్ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ.. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షోను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న ఇండియన్ ఐడల్ షో.. ఇప్పుడు సీజన్ 4లోకి అడుగుపెట్టింది. తమన్, సింగర్ కార్తిక్, సింగర్ గీతా మాధురి అలరిస్తుండగా.. సింగర్ శ్రీరామచంద్ర, సమీరా భరద్వాజ్ హోస్టింగ్ తో ఆకట్టుకుంటున్నారు.

సీజన్ 4లో ఇప్పటికే పలువురు సినీ సెలబ్రెటీలు హాజరైసందడి చేశారు. ఈషోలో మిత్రమండలి మూవీ టీమ్ పాల్గొని సందడి చేసింది. ప్రియదర్శి, విష్ణు, రాగ్ మయార్, ప్రసాద్ బెహరా, నిహారిక ఎన్ ఎమ్ ఇండియన్ ఐడల్ షోలో సందడి చేశారు. ఈ మూవీ అక్టోబర్ 16న రిలీజ్ కానుంది. మిత్రమండలి ఇండియన్ ఐడల్ స్టేజ్ పై అదరగొట్టారు. తాజాగా లేటేస్ట్ హిట్స్ సాంగ్స్ తో సింగర్స్ అదరగొట్టారు.

ప్రస్తుతం మిత్రమండలి మూవీ టీమ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఇండియన్ ఐడల్ షో ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ ను అస్సలు మిస్ అవ్వకండి. ఇటీవల సూపర్ హిట్ అయిన పాటలతో ఎంట్రీ ఇచ్చారు సింగర్స్. తమ పాటలతో ప్రేక్షకులను అలరించారు. అలాగే మిత్రమండలి మూవీ టీమ్ స్టేజ్ పై నవ్వులు పూయించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి