
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం రెట్రో. చాలా రోజుల తర్వాత పూజా హెగ్డే ఈ సినిమాతో మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది. కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ మూవీని తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రిలీజ్ చేసింది. దీంతో సహజంగానే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పోస్టర్స్, టీజర్లు, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడం, ప్రమోషన్లు కూడా గట్టిగా నిర్వహించడంతో రెట్రో సినిమాపై మొదటి నుంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. మే డే సందర్భంగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు ఆడియెన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సూర్య, పూజల యాక్టింగ్ బాగున్నా కథ, కథనాలు ఆడియెన్స్ ను నిరాశ పర్చాయి. అయితే తమిళ్ తో మాత్రం రెట్రో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మొత్తానికి థియేటర్లలో సోసో గా ఆడింది రెట్రో మూవీ. ఇప్పుడీ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలోకి వస్తోంది. రెట్రో సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మొదట ఈ సినిమాను జూన్ తొలి వారంలో స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. అయితే తెలుగులో పెద్దగా రెస్పాన్స్ రావడంతో మే చివరి వారంలోనే సూర్య సినిమాను ఓటీటీ లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుందని సమాచారం.
రెట్రో సినిమాను 2డీ ఎంటర్‌టైన్‍మెంట్స్, స్టోన్‍బీచ్ ఫిల్మ్స్ బ్యానర్ల పై సూర్య, జ్యోతిక, కార్తికేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. జోజు జార్జ్, ప్రకాష్ రాజ్, నాజర్, జయరాం, సుజిత్ శంకర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణణ్ సంగీతం అందించారు. 1990ల బ్యాక్‍డ్రాప్ లో రొమాంటిక్ యాక్షన్ మూవీగా రెట్రో ను తెరకెక్కించారు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్. లవ్ స్టోరీ, గ్యాంగ్‍స్టర్ల వార్ గా ఈ మూవీ స్టోరీ సాగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే మేకప్ లేకుండా డీగ్లామరస్ లుక్‍లో కనిపించడం విశేషం.
The epitome of #Retro romance 💽🥀
Forever grateful to @ilaiyaraaja sir for this magical masterpiece…#RetroRunningSuccessfully #TheOneWon@Suriya_Offl #Jyotika @karthiksubbaraj @hegdepooja @Music_Santhosh @prakashraaj @C_I_N_E_M_A_A @rajsekarpandian @kaarthekeyens @kshreyaas… pic.twitter.com/oneuzwDfR8
— 2D Entertainment (@2D_ENTPVTLTD) May 12, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .