OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన 120 కోట్ల సినిమా.. రెజీనా విలనిజం ఓ రేంజ్‌లో.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌

సాధారణంగా థియేటర్లలో విడుదలైన నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి సినిమాలు. అయితే ఈ సూపర్ హిట్ సినిమా మాత్రం స్ట్రీమింగ్ కు రావడానికి ఎనిమిది వారాలు పట్టింది. యాక్షన్ ప్యాక్డ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 120 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన 120 కోట్ల సినిమా.. రెజీనా విలనిజం ఓ రేంజ్‌లో.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌
OTT Movie

Updated on: Jun 05, 2025 | 7:40 AM

 

ఈ మధ్యన బాలీవుడ్ జనాలకు టాలీవుడ్ సినిమాలు తెగ నచ్చేస్తున్నాయి. అలాగే తెలుగు డైరెక్టర్లు, నిర్మాతలు తెరకెక్కించిన సినిమాలను కూడా ఎగబడి చూస్తున్నారు. ఈ మూవీ మొదట తెలుగులోనే తీద్దామనుకున్నారు. అది కూడా మ్యాన్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో. అయితే అప్పటికే ఇతర సినిమాలతో బాలయ్య బిజీగా ఉండడంతో ఈ సినిమా బాలీవుడ్ కు వెళ్లింది. పేరుకు హిందీ సినిమానే అయినా ఇందులో నటించింది మొత్తం దాదాపు తెలుగు వారే. రెజీనా కసాండ్రా, జగపతి బాబు, రమ్యకృష్ణ, రవిశంకర్, ఉపేంద్ర, సయామీ ఖేర్, జెరీనా వాహబ్, వినీత్ కుమార్, స్వరూప ఘోష్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ రెజీనా ఓ రేంజ్ లో విలనిజం పండించింది. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాను నిర్మించినది మరెవరో కాదు పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మైత్రీ మూవీ మేకర్స్. ఈ సినిమా కథ కూడా చీరాలలోని మోతుపల్లి వేదికగా సాగుతుంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ బాలీవుడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో సన్ని డియోల్ హీరోగా నటించాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఏ సినిమా గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. ఆ మూవీ పేరు జాట్.

ఇవి కూడా చదవండి

ఏప్రిల్ 10న విడుదలైన జాబ్ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఓవరాల్ గా రూ. 120 కోట్లకు వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయలేదు. దీంతో చాలా మంది ఈ యాక్షన్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వీరి నిరీక్షణకు తెరపడింది. జాట్ సినిమా హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. గురువారం (జూన్ 05) అర్ధరాత్రి నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. హిందీతో పాటు తెలుగులోనూ జాట్ అందుబాటులో ఉంది.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..