చాలా రోజుల తర్వాత బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మళ్లీ కళకళలాడుతోంది. దీనికి ప్రత్యేక కారణం గదర్ 2 సినిమా భారీ వసూళ్లని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా ఆగస్టు 11న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. 2001లో వచ్చిన గదర్: ఏక్ ప్రేమ్ కహానీ చిత్రానికి సీక్వెల్‍గా తెరకెక్కిన ఈ సినిమాలో సన్నీ డియోల్, అమీషా పటేల్ హీరో, హీరోయిన్లుగా నటించారు. కేవలం రూ. 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు
ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.450 కోట్లు రాబట్టింది. 500 కోట్ల వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే గదర్ 2 ధాటికి బాహుబలి, కేజీఎఫ్, పఠాన్ లాంటి సినిమాల రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఈ క్రమంలో గదర్ 2 సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా? అని ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ డేట్ చెప్పాలంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వీటిపై డైరెక్టర్ అనిల్ శర్మ స్పందించారు. గదర్ 2 ఓటీటీ రిలీజ్ గురించి షాకింగ్ విషయం చెప్పారు. ప్రస్తుతం ఆడియెన్స్ ‘గదర్2′ సినిమాను థియేటర్లలో చూసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. మరికొన్ని రోజుల పాటు ఈ ట్రెండ్ కొనసాగవచ్చు. నాకు తెలిసినంత వరకు మరో ఆరునెలల తర్వాతే గదర్ 2 సినిమా ఓటీటీలోకి వస్తుంది. అప్పటివరకు మా సినిమాను బిగ్ స్క్రీన్‌పైనే చూస్తారని అనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చారు డైరెక్టర్.
‘గదర్ 2’ సినిమాలో ఉత్కర్ష శర్మ, గౌరవ్ చోప్రా, మనీశ్ చోప్రా, మనీష్ వాదా తదితరులు కీలకపాత్రలు పోషించారు. జీ స్టూడియోస్ సంస్థతో కలిసి డైరెక్టర్ అనిల్ శర్మనే ఈ మూవీని నిర్మించారు. కాగా మొదట గదర్ 2 సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు. పైగా కొన్ని వివాదాలు కూడా చుట్టుముట్టాయి. దీనికి తోడు గత కొన్నేళ్లుగా సన్నీ డియోల్, అమీషా పటేల్‌లకు హిట్ సినిమాలు లేవు. ఇలాంటి ఎన్నో ప్రతికూలతల మధ్య రిలీజైన గదర్2 సినిమా బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకెళుతోండడం గమనార్హం.
CROSSES ‘KGF 2’, NEXT ‘BAAHUBALI 2’… After crossing *lifetime biz* of #Dangal, #Gadar2 overtakes #KGF2 #Hindi… #Gadar2 is now THIRD HIGHEST GROSSING #Hindi film in #India… Continues to smash #BO records at mass sectors… [Week 3] Fri 7.10 cr, Sat 13.75 cr. Total: ₹ 439.95 cr.… pic.twitter.com/fDoB3kPeW3
— taran adarsh (@taran_adarsh) August 27, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..