టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో, నవ దళపతి సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం హరోం హర. జ్ఞాన సాగర్ ద్వారక తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. టీజర్స్, ట్రైలర్ కేజీఎఫ్, పుష్పల స్టైల్ లో ఉండడం, ప్రమోషన్స్ కూడా గట్టిగా నిర్వహించడంతో హరోం హర సినిమాపై బజ్ బాగానే క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్లుగానే భారీ అంచనాల మధ్య జూన్ 14న థియేటర్లలో రిలీజైన హరోంహర కు పాజిటివ్ రెస్పాన్స్ నే వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే మూవీ మొత్తం యాక్షన్ సీక్వెన్స్ తో చుట్టేయడంతో హరం హర సినిమా కొంత మందికి నచ్చలేదు. అందుకే ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడలేకపోయింది. ఓవరాల్ గా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్న సుధీర్ బాబు సినిమా గురువారం (జులై 11) ఓటీటీలోకి రావాల్సి ఉంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఆహాతో పాటు ఈటీవీ విన్ కూడా హరోం హర మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నాయి. జులై 11 నుంచి స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు అధికారిక ప్రకటనలు కూడా ఇచ్చేశాయి. అయితే ఇప్పటివరకు హరోం హర సినిమా ఏ ఓటీటీలోనూ కనిపించడం లేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
కాగా ఇటీవల నవ దీప్ లవ్ మౌళి సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగింది. అధికారిక స్ట్రీమింగ్ డేట్ బదులు తర్వాతి రోజే ఓటీటీలోకి వచ్చింది. మరి హరోం హర సినిమా విషయంలో కూడా ఇలాగే జరుగుతుందేమో చూడాలి. శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జి.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. జయప్రకాశ్, రవి కాలే, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. చేతన్ భరద్వాజ్ హరోంహర సినిమాకు స్వరాలు సమకూర్చారు.
Balavanthudiki ayudham avasaram..🤨
Kaani baalaheenudiki Ayudhame balam!⚔️#HaromHara Premieres July 11th only on aha!@isudheerBabu @ImMalvikaSharma @suneeltollywood @gnanasagardwara @chaitanmusic @SumanthnaiduG @SSCoffl @JungleeMusicSTH pic.twitter.com/Klf0BsDStc— ahavideoin (@ahavideoIN) July 8, 2024
A perfect picture for @isudheerbabu ..And Pakka entertainment picture for your weekend 😉
Premiers JULY 11 on @etvwin#HaromHara#EtvWin #WinThoWinodam pic.twitter.com/20XDmurL94— ETV Win (@etvwin) July 9, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.