OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ సిరీస్.. యూజర్ల తాకిడికి నెట్‌ఫ్లిక్స్ సర్వర్లు క్రాష్

గురువారం (నవంబర్ 27)న ఓటీటీలో విడుదలైన ఈ వెబ్ సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. అందుకే స్ట్రీమింగ్ కు వచ్చిన వెంటనే ఈ సిరీస్ ను చూడాలని మూవీ లవర్స్ తహతహలాడిపోయారు. కట్ చేస్తే.. యూజర్ల తాకిడికి నెట్ ఓటీటీ సర్వర్లు క్రాష్ అయ్యాయి..

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ సిరీస్.. యూజర్ల తాకిడికి నెట్‌ఫ్లిక్స్ సర్వర్లు క్రాష్
Stranger Things Season 5 Web Series

Updated on: Nov 27, 2025 | 10:21 PM

ఎప్పటిలాగే గురు, శుక్రవారాల్లో ఓటీటీల్లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. అలా ఈ గురువారం(నవంబర్ 27) కూడా పలు కొత్త సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందన సినిమాలు ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అలా స్ట్రీమింగ్ కు వచ్చిన వాటిలో ఒక బ్లాక్ బస్టర్ సిరీస్ సీక్వెల్ కూడా ఉంది. ఈ సిరీస్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ క్రేజీ సిరీస్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటి దాకా ఈ సిరీస్ లో వచ్చిన నాలుగు సీజన్స్ వచ్చాయి. అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. సినీ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా యాక్షన్ మూవీ లవర్స్ కు ఈ సిరీస్ ఫేవరెట్ గా మారిపోయింది. ఈ క్రమంలోఈ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ ఐదో సీజన్ గురువారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. కానీ ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చిన వెంటనే నెట్ ఫ్లిక్స్ సర్వర్లు క్రాష్ అయ్యాయి.

స్ట్రేంజర్ థింగ్స్ వెబ్ సిరీస్ మొదటి సీజన్ 2016 లో నెట్‌ఫ్లిక్స్ OTT లో స్ట్రీమింగ్ అయ్యింది. ఆ తర్వాత రెండవ సీజన్ 2017 లో, మూడవ సీజన్, 2019 లో, నాలుగో సీజన్ 2022 లో స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. ఇంగ్లిష్ లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ పరిస్థితిలో ఈ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ ఐదవ సీజన్ గురువారం (నవంబర్ 27) అర్ధరాత్రి నుంచి నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. అయితే ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ OTTలో విడుదలైన వెంటనే, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది సినీ అభిమానులు నెట్ ఫ్లిక్స్ కు లాగిన్ అయ్యారు. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్-5 ను చూసేందుకు తహతహలాడిపోయారు. దీంతో చాలా సమయం పాటు నెట్‌ఫ్లిక్స్ స్తంభించిపోయింది. యూజర్ల తాకిడికి సర్వర్లు క్రాష్ అయ్యాయి. సిరీస్ ఎపిసోడ్‌లను చూడటానికి ప్రయత్నిస్తున్న అభిమానులు నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో లోడింగ్, లాగిన్ సమస్యలను ఎదుర్కొన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ OTT సేవలను ప్రభావితం చేసినప్పటికీ, కంపెనీ వెంటనే సమస్యను పరిష్కరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.