కొత్త బంగారు లోకం, ముకుంద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం వంటి సినిమాలతో ఫీల్ గుడ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీకాంత్ అడ్డాల. అయితే వెంకటేష్ నారప్ప సినిమాతో తనలో మాస్ డైరెక్టర్‌ను కూడా బయటకు తీశారు. ఆ తర్వాత ‘పెదకాపు’ అంటూ మరో మాస్ మూవీని తెరకెక్కించాడు. మూవీ తీయడమే కాదు ఓ భయంకరమైన విలన్‌గా సరికొత్త రోల్ పోషించారు. పెదకాపు సినిమాలో కొత్త హీరో విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాత్సవ హీరో, హీరోయిన్లుగా నటించారు. స్టార్ యాంకర్ అనసూయ మరో కీలక పాత్రలో మెరిసింది. అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. రిలీజుకు ముందే ఈ సినిమా టైటిల్, టీజర్, పోస్టర్స్, ట్రైలర్‌తో ఎంతో ఆసక్తిని కలిగించాయి. మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కిన పెద కాపు మొదటి భాగం సెప్టెంబర్ 29న గ్రాండ్‌గా విడుదలైంది. అగ్ర వర్ణాల రాజకీయాల కారణంగా దళిత వర్గాలు ఎలా అణచివేతకు గురువుతున్నారన్న సున్నితమైన అంశంపై తెరకెక్కిన పెదకాపు మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లు మాత్రమే సాధించింది. ఇప్పుడీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో పెద కాపు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (అక్టోబర్ 27) అర్ధరాత్రి నుంచే ఈ మూవీని ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చింది.
పెద కాపు సినిమాలో రావు, రమేష్, తనికెళ్ల భరణి, నాగేంద్ర బాబు, బ్రిగిడ సాగా, రాజీవ్ కనకాల, అనసూయ భరద్వాజ్, ఈశ్వరి రావు, అడుక్కలం నరేన్ ప్రధాన పాత్రలు పోషించారు. ద్వారాకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ మూవీకి మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చారు. చోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. అగ్ర కులాల రాజకీయాల వ్యవస్థకు వ్యతిరేకంగా ఓ యువకుడు ఎదురుతిరగడం , తమ జాతిని తక్కువ చేసి చూసిన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాన్నదే పెదకాపు సినిమా కథ. పూర్తి మాస్ యాక్షన్ జోనర్‌తో తెరకెక్కిన ఈ మూవీని థియేటర్లలో మిస్ అయ్యారా? మరి ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
Telugu film #PeddhaKapu1 (2023) is now streaming on Amazon Prime Video.
In 4K & Dolby Atmos. pic.twitter.com/1qVnPhTepS
— OTT Gate (@OTTGate) October 26, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..