థియేట్రికల్ రిజల్ట్ ఎలా ఉన్నా… ఫ్యామిలీ డ్రామాలుగా తెరకెక్కిన చాలా సినిమాలు ఓటీటీలో సూపర్ హిట్ అవుతున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జామ్‌పుల్ చావు కబురు చల్లగా. కార్తికేయ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో పెద్దగా మెప్పించలేకపోయినా ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ అయ్యింది. తాజాగా శ్రీకారం సినిమాకు కూడా అలాంటి రిజల్ట్ వస్తోంది. థియేటర్ ఆడియన్స్ రిజెక్ట్ చేసిన ఈ సినిమాను ఓటీటీ ఆడియన్స్ మాత్రం ఆదరిస్తున్నారు. ఈ మధ్యే డిజిటల్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డ్ వ్యూస్ సాధిస్తోంది. గతంలో క్రాక్, కలర్ ఫోటో లాంటి సినిమాలు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణతోనే సూపర్ హిట్ అయ్యాయి.
తాజాగా ఈ లిస్ట్‌లో మరో సినిమా చేరింది. తమిళ హీరో కార్తి నటించిన సుల్తాన్ శుక్రవారం ఆహాలో రిలీజ్ అయ్యింది. ఫస్ట్ డేనే రికార్డ్ స్ట్రీమ్స్ సాధించిన సుల్తాన్… ఓటీటీలో బ్లాక్ బస్టర్ టాక్ సాధించింది. కోవిడ్ కారణంగా థియేట్రికల్ రన్ పెద్దగా లేకపోయినా.. తెలుగు ఓటీటీ ఆహా ద్వారా తెలుగు ఆడియన్స్ అందరికీ చేరువ కావటంతో సుల్తాన్ సూపర్‌హిట్ అన్న టాక్ సాధించింది.
Also Read: పెళ్లిపీటలెక్కనున్న మరో స్టార్ హీరోయిన్.. వ్యాపారవేత్తను వివాహం చేసుకోనున్న త్రిష ?