Cobra Movie: విక్రమ్ (Vikram) హీరోగా వచ్చిన చిత్రం ‘కోబ్రా’. ఆగస్టు 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ముఖ్యంగా విక్రమ్ డిఫ్రంట్ గెటప్స్‌తో ఆకట్టుకున్నాడు. మది పాత్రలో తనదైన నటనతో మెస్మరైజ్ చేశాడు విక్రమ్. అంతేకాకుండా ఈ చిత్రంలో ఇంటర్ పోల్ అధికారి అస్లాన్ పాత్రలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ నటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. థియేటర్‌లో విడుదలైన నెల రోజులకే సినిమా ఓటీటీలో విడుదల కానుంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీ హక్కులను సోనీ లివ్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని సోనీ లివ్ ట్విట్టర్ వేదికగా అధికారికంగా పంచుకుంది. కొత్త ట్రైలర్‌తో పాటు ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఇక్కడ ఓ చిన్న ట్విస్ట్ ఉంది. సినిమా ఓటీటీ విడుదలను ప్రకటించినప్పటికీ ఏయే భాషల్లో స్ట్రీమింగ్ ఉంటుందనే విషయాన్ని మాత్రం తెలపలేదు. అయితే సోనీ లివ్ యాప్‌లో మాత్రం ఈ సినిమా తమిళ్ వెర్షన్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొన్నారు.
Chiyaan Vikram & Srinidhi Shetty நடிப்பில், இசை புயல் AR Rahmanனின் மிரட்டலான இசையில், பணத்திற்காக பல அதிரடியான அவதாரங்கள் எடுத்து கணிதத்தால் அனைவரையும் கலங்கடிக்கும் ஒரு சாமானிய ஆசிரியரின் கதை #Cobra Sept 28 முதல் உங்கள் #Sony LIVல் #CobraOnSonyLIV pic.twitter.com/ydJBWZIQt7
— SonyLIV (@SonyLIV) September 23, 2022
వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాలో విక్రమ్‌కు జోడిగా కేజీఎఫ్ ఫేమ్.. శ్రీనిధి శెట్టి నటించిన విషయం తెలిసిందే. లెక్కల మాస్టారుగా ఉన్న మది.. నేరాలు ఎందుకు చేయాల్సి వచ్చిందన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి మార్కులే పడ్డాయని చెప్పాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..