Ayalaan OTT: శివకార్తికేయన్ అయలాన్‌ ఓటీటీపై అధికారిక ప్రకటన.. డైరెక్టుగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు.. ఎప్పుడంటే?

కోలీవుడ్ స్టార్‌ హీరో శివ కార్తికేయన్‌ నటించిన లేటెస్ట్‌ సినిమా అయలాన్‌. ఏలియన్‌ బ్యాక్ డ్రాప్‌లో సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే కేవలం తమిళ్‌ వెర్షన్‌ మాత్రమే రిలీజైంది. పొంగల్‌కు పోటీ ఎక్కువగా ఉండడంతో తెలుగు వెర్షన్‌ను వాయిదా వేశారు

Ayalaan OTT: శివకార్తికేయన్ అయలాన్‌ ఓటీటీపై అధికారిక ప్రకటన.. డైరెక్టుగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు.. ఎప్పుడంటే?
Ayalaan

Updated on: Jan 28, 2024 | 7:36 AM

 

కోలీవుడ్ స్టార్‌ హీరో శివ కార్తికేయన్‌ నటించిన లేటెస్ట్‌ సినిమా అయలాన్‌. ఏలియన్‌ బ్యాక్ డ్రాప్‌లో సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే కేవలం తమిళ్‌ వెర్షన్‌ మాత్రమే రిలీజైంది. పొంగల్‌కు పోటీ ఎక్కువగా ఉండడంతో తెలుగు వెర్షన్‌ను వాయిదా వేశారు. జనవరి 26న తెలుగు వెర్షన్‌ను రిలీజ్‌ చేయాలనుకున్నారు మేకర్స్‌. అయితే అది కూడా జరగలేదు. తెలుగు వెర్షన్‌ మరోసారి వాయిదా పడింది. అలా ‘అయలాన్’ సినిమా తెలుగు వెర్షన్ విడుదలపై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇంతలోనే శివకార్తి కేయన్‌ సినిమా ఓటీటీ ప్రకటన వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సన్‌ నెక్ట్స్‌ అయలాన్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే శివ కార్తికేయన్‌ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ‘అయాలన్‌ త్వరలోనే ఓటీటీలోకి తీసుకురాబోతున్నాం. నెక్ట్స్‌ అప్‌ డేట్ కోసం వేచి చూస్తు ఉండండి’ అని శనివారం తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ షేర్‌ చేసింది. ఇందులో ఓటీటీ రిలీజ్‌ డేట్‌ గురించి క్లారిటీ ఇవ్వలేదు కానీ ఫిబ్రవరి 16 నుంచే అయలాన్ ను స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు టాక్‌ నడుస్తోంది. అంతకు ముందే ఓటీటీలోకి వచ్చినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని కోలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి

రాబోయే శుక్రవారం అంటే ఫిబ్రవరి 2న అయలాన్‌ తెలుగు వెర్షన్‌ను థియేటర్లలో రిలీజ్‌ చేయవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే పది రోజుల్లోనే శివ కార్తికేయన్‌ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశముంది. అసలు అయలాన్‌ తెలుగు వెర్షన్‌ను థియేటర్‌లో రిలీజ్‌ చేస్తారా? లేదా నేరుగా ఓటీటీలోకి తీసుకొస్తారా? అన్నది సస్పెన్స్‌గా మారింది. మరో రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..