Ghost OTT: అఫీషియల్‌.. అప్పుడే ఓటీటీలోకి శివన్న యాక్షన్ థ్రిల్లర్.. ఘోస్ట్‌ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

|

Nov 14, 2023 | 2:48 PM

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ఘోస్ట్‌. దసరా కానుకగా అక్టోబర్‌ 19న విడుదలైన ఈ సినిమా కన్నడ నాట సూపర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అయితే దసరా పండగకు తెలుగులో తీవ్రమైన పోటీ ఉండడంతో తెలుగు వెర్షన్‌ రెండు వారాలు ఆలస్యంగా అంటే నవంబర్‌ 4న విడుదలైంది.

Ghost OTT:  అఫీషియల్‌.. అప్పుడే ఓటీటీలోకి శివన్న యాక్షన్ థ్రిల్లర్.. ఘోస్ట్‌ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ghost Movie
Follow us on

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ఘోస్ట్‌. దసరా కానుకగా అక్టోబర్‌ 19న విడుదలైన ఈ సినిమా కన్నడ నాట సూపర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అయితే దసరా పండగకు తెలుగులో తీవ్రమైన పోటీ ఉండడంతో తెలుగు వెర్షన్‌ రెండు వారాలు ఆలస్యంగా అంటే నవంబర్‌ 4న విడుదలైంది. అయితే ఇక్కడ పెద్దగా ప్రమోషన్లు నిర్వహించకపోవడంతో ఘోస్ట్‌ సినిమా పెద్దగా బజ్‌ను క్రియేట్‌ చేయలేకపోయింది. పెద్దగా వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. అయితే కన్నడలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఘోస్ట్‌ మూవీ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ 5 ఘోస్ట్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఈక్రమంలో శివరాజ్‌ కుమార్ సినిమా స్ట్రీమింగ్‌కు సంబంధించి మంగళవారం (నవంబర్‌14)న అధికారిక ప్రకటన విడుదల చేసింది. నవంబర్ 17వ తేదీన ఘోస్ట్ మూవీని ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానున్నట్టు జీ5 ప్రకటించింది. కన్నడతో పాటు తెలుగులోనూ ఈ గ్యాంగస్టర్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ స్ట్రీమింగ్‌కు రానుంది.

ఘోస్ట్‌ సినిమా పూర్తిగా వన్‌ మేన్‌ షో. సినిమా మొత్తం హీరో శివరాజ్‌ కుమార్‌ చుట్టే తిరుగుతుంది. ఇందులో బిగ్‍డాడీ, ముద్దన్న అనే గ్యాంగ్‍స్టర్స్‌ అదరగొట్టాడు శివన్న. ఎంజీ శ్రీనివాస్‌ తెరకెక్కించిన ఈ మూవీలో జయరాం, అనుపమ్‌ ఖేర్‌, ప్రశాంత్ నారాయణన్‌, అర్చనా జోస్‌, సత్య ప్రకాష్‌, అభిజిత్‌, తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఘోస్ట్ సినిమాను సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సందేశ్ నాగరాజ్ నిర్మించారు. అరుణ్ జన్య ఈ సినిమాకు మ్యూజిక్‌ అందించారు. మహేంద్ర సిమ్హా సినిమాటోగ్రఫీ చేయగా.. దీపూ కుమార్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. మరి థియేరట్లలో ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను మిస్‌ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

జీ 5 లో స్ట్రీమింగ్..

శివన్న వన్ మెన్ షో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..