Ooru Peru Bhairavakona OTT: ఓటీటీలో సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవ కోన’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

|

Feb 26, 2024 | 6:29 PM

ఫిబ్రవరి 16న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సోమవారం (ఫిబ్రవరి 26) అంటే 10 రోజుల్లో రూ.25.11 కోట్లకి పైగా వసూళ్లు వచ్చినట్లు స్వయంగా హీరో సందీప్ కిషన్ ట్వీట్ చేశాడు. ఆసక్తికరమైన కథ, కథనాలు, విజువల్స్, బీజీఎమ్‌, సందీప్ నటన ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.

Ooru Peru Bhairavakona OTT: ఓటీటీలో సందీప్ కిషన్ ఊరు పేరు భైరవ కోన.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Ooru Peru Bhairavakona Movie
Follow us on

గత కొన్నేళ్లుగా వరుసగా ప్లాఫ్‌ లతో సతమతమవుతోన్న సందీప్ కిషన్‌ కు ఊరు పేరు భైరవ కోన బిగ్ రిలీజ్ ఇచ్చింది. డైరెక్టర్ వీఐ ఆనంద్ తెరకెక్కించిన ఈ ఫాంటసీ అడ్వెంచెరస్ థ్రిల్లర్ సూపర్ హిట్ గా నిలిచింది. ఫిబ్రవరి 16న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సోమవారం (ఫిబ్రవరి 26) అంటే 10 రోజుల్లో రూ.25.11 కోట్లకి పైగా వసూళ్లు వచ్చినట్లు స్వయంగా హీరో సందీప్ కిషన్ ట్వీట్ చేశాడు. ఆసక్తికరమైన కథ, కథనాలు, విజువల్స్, బీజీఎమ్‌, సందీప్ నటన ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన ఊరు పేరు భైరవ కోన ఓటీటీ రిలీజ్ డేట్ పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటటీ సంస్థ జీ5 దక్కించుకుందట. ముందస్తు ఒప్పందం ప్రకారం థియేట్రికల్ రిలీజ్‌ తర్వాత నెల రోజులకు సినిమాను ఓటీటీలోకి స్ట్రీమింగ్ చేయాలని నిర్మాతలు, ఓటీటీ సంస్థల మధ్య ఒప్పందం కుదిరిందట. దీని ప్రకారం థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత అంటే మార్చి 15న ఊరు పేరు భైరవ కోన ఓటీటీలోకి రావొచ్చని సమాచారం. మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.

ఊరు పేరు భైరవ కోన సినిమాలో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు.. వెన్నెల కిషోర్, వైవా హర్, రవిశంకర్ తదితరులు ష కీలకపాత్రలు పోషించారు. శేఖర్ చంద్ర స్వరాలు సమకూర్చారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. భైరవ కోనే అనే ఊరిలో ఎవరు అడుగుపెట్టినా ప్రాణాలతో తిరిగిరారనే ప్రచారం ఉంటుంది.. అయితే ఒక రోజు రాత్రి పెళ్లి లో దొంగతనం చేసి పోలీసుల నుంచి తప్పించుకుని వస్తున్న బసవ (సందీప్ కిషన్), తన స్నేహితుడు జాన్ (వైవా హర్ష), అగ్రహారం గీత (కావ్య థాపర్)తో కలిసి అనుకోకుండా ఆ ఊరిలోకి వెళ్తారు. మరి భైరవకోనలో వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? గరుడ పురణాంలో కనిపించకుండా పోయిన నాలుగు పేజీలకు.. ఆ ఊరికి ఉన్న సంబంధం ఏంటీ ? భైరవకోన నుంచి బసవ గ్యాంగ్ బయటపడిందన్నదే ఊరు పేరు బైరవకోన సినిమా

ఇవి కూడా చదవండి

స్టడీగా కలెక్షన్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.